Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుమానాలను నివృత్తి చేయగల మరో ఆధారం 'మహానామ'. ఈ నివేదిక ప్రకారం రాజు అబ్దుల్లా, యాభై కోట్ల ఐదు లక్షల హున్స్ నిల్వ వున్న తన ఖజానా తాళపు చెవులను అబుల్ హసన్ చేతికిచ్చి వాటి రక్షణ బాధ్యత అప్పగిస్తూ రాజ్య పాలనా వ్యవహారాలలో అవసరమైన చోట్ల ఉపయోగించ వచ్చునని సలహా ఇస్తాడు.

పట్టాభిషేకం విషయంలో న్యాయపరమైన అంశాలేమైనప్పటికీ, రాజు నిజమైన కోరిక ఏదైనా రాజకీయ పోకడలు మాత్రం అబుల్ హసన్ వైపే అనుకూలతను ప్రకటించసాగాయి. సయ్యద్ అహ్మద్ తన అహంకార పూరిత ప్రవర్తనతో, అనాలోచితమైన చర్యలతో తన భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు. స్వాభిమానం, అహంకారం అతని సహజ లక్షణాలు. ఉన్నత పదవుల్లో వున్నందున అధికార గర్వం, రాజుగారి పెద్దల్లుడు అన్న భావంతో మితిమీరిన ఆత్మవిశ్వాసం కలిగి, తదుపరి రాజును తనే అన్న ఆశలు పెట్టుకున్నాడు. తన కోప స్వభావం, అహంకారంతో దాదాపు రాజ ప్రముఖులందరి సానుభూతికి దూరమయ్యాడు. దీనికి విరుద్ధంగా అబుల్ హసన్ తన సౌమ్య స్వభావంతో, మానవతావాది లక్షణాలతో, వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ, అటు అన్ని వర్గాల ప్రజలనుండి, ఇటు అధికారులు, రాజ ప్రముఖుల మన్ననలందుకుంటూ అందరి మద్దతులందుకుంటూ దగ్గరవ్వసాగాడు.

ఖఫీఖాన్ చరిత్రకారుడి మాటల్లో :

"15-16 సంవత్సరాలు ఆశ్రమ జీవితాన్ని గడిపి జీవితంలోని ఒడిదుడుకులను అనుభవించి, అనేక ఆటుపోట్లను అధిగమించి ఒక సంస్కారవంతుడిగా, మానవతా వాదిగా తన్ను తాను సంస్కరించుకుని నైతిక విలువలతో ఎదిగిన పెద్ద మనిషిగా అందరి అభిమానానికి పాత్రుడయ్యాడు”. ఈ లక్షణాలు కూడా వాటి ప్రభావాన్ని చూపసాగాయి. తీవ్రమైన మనోవేదనతో రాజు మరణశయ్య నెక్కడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాజధాని రెండు వర్గాలుగా చీలిపోయింది. సయ్యద్ అహ్మద్ వర్గం, అబుల్ హసన్ సానుభూతి పరులవర్గం. అబుల్ హసన్ పక్షాన సయ్యద్ ముజఫ్ఫర్, మూసాఖాన్ హవల్దార్, ఇంకా హిందూ సోదరులైన అక్కన్న, మాదన్నలు. అక్కన్న మాదన్న సోదరులు చాలా చురుకైన వ్యక్తులు. అధికారం కలిగి తమ వ్యక్తికి అతని హక్కులను సాధించి పెట్టగలదృఢ సంకల్పం గలవారు. రాజుతో దగ్గరి సంబంధం కలిగి వుండి, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే వ్యక్తిగా నిస్సందేహంగా సయ్యద్ అహ్మద్ కచ్చితంగా తన ప్రత్యర్థికన్నా తనకే ప్రయోజనాలెక్కువ. రాజభవనం లోపలకార్య నిర్వహణ అహ్మద్