వుండటం, చక్రవర్తి నుండి కూడా ఎలాంటి దావా, ఒత్తిడి లేకపోవడంతో, సింహాసన వారసుడి ఎన్నిక ప్రభుత్వం భుజాలపై పడింది. మహమ్మద్ సుల్తాన్ విషయం పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. సింహాసనంపై ప్రధాన హక్కుదారుడిగా సయ్యద్ అహ్మద్కే అధికారం వుంది, అబుల్ హసన్ కన్నా పెద్దల్లుడిగా ఇతనికే అవకాశాలు ఎక్కువ ఆశాజనకంగా వున్నాయి. సయ్యద్ అహ్మద్ భార్య, రాజు అబ్దుల్లా పెద్ద కూతురు 'మన్ సాహెబ్' (Man Saheb), బడి సాహిల్ని (Bari Sahibni) గా పిలవబడే రాకుమారి తనవైపు నుండి అన్ని విధాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 1080 A.H.లో హయత్ బక్షీ బేగమ్ మరణం తర్వాత సయ్యద్ అహ్మద్ రాజకీయ సలహా దారుడిగా, పరిపాలనా వ్యవహారా లను తన కనుసన్నల్లో నడుపుతూ రాజ్య పాలనలో ప్రధాన పాత్ర వహించసాగాడు సయ్యద్ అహ్మద్. భర్తతో పాటు 'మన్సాహిబ్' అనేక ప్రయాసలకోర్చి రాజ ప్రముఖులతోనూ సంప్రదింపులు జరుపుతూ భర్తకు అనుకూలంగా పరిస్థితులను ప్రభావితం చేయసాగింది. మరోవైపు అబుల్ హసన్ న్యాయపరంగా అధికారం, హక్కులేని వ్యక్తిగా అవకాశాలు కూడా చాలా తక్కువగా కనబడ సాగాయి.
రాజు అబ్దుల్లా జీవించి వున్న కాలంలో ఎన్నడూ సింహాసనానికి తన వారసుడు ఎవరనేది నిర్ణయించుకోలేదన్నది వాస్తవం. కాని తక్కువ మాట్లాడే స్వభావం కలిగిన అబ్దుల్లా మనసులో ఈ విషయమై అంతర్మథనం జరుగుతున్నది అన్న విషయం కూడా అంతే వాస్తవం. సయ్యద్ అహ్మద్ నే వారసుడిగా అనుకున్నట్లైతే నిర్ద్వంద్వంగా ప్రకటించి తగిన పట్టాభిషేకం ఏర్పాట్లు జరిపించేవాడు. కాని ఈ విషయంలో అతని మౌనం సయ్యద్ అహ్మద్ కన్నా అబుల్ హసన్ వైపే ఇష్టత మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. కాని అహ్మద్ ప్రభావపూరితమైన ఆధిపత్య ధోరణికి భయపడి తన మనసులోని మాటను బయటపెట్టే ధైర్యం చేయలేకపోయాడు అబ్దుల్లా. ఈ వాస్తవాన్ని ఫ్రెంచి యాత్రికుడు ఫ్రెయర్ (Freyer) వివరణ కూడా బలపరుస్తున్నది. సయ్యద్ ముజఫ్ఫర్ (Syed Muzaffer) సలహా మేరకు రాజు అబ్దుల్లా, అబుల్ హసన్ పేరునే తన వారసుడిగా ప్రకటించాడు అని ఫ్రెయర్ చెబుతాడు. ఈ నివేదికలో నిజం వున్నా లేకపోయినా అబుల్ హసన్ పేరునే ప్రతిపాదించడంలో బలమైన కారణం లేకపోలేదు. హసన్ తన వంశ మూలాలతో సంబంధం వున్నవాడని, సయ్యద్ అహ్మద్ పోల్చి చూస్తే హసన్ నమ్మకస్తుడని తెలుస్తుంది. ఆ కాలంలో ప్రసిద్ధుడైన, గొప్ప సూఫీ శిష్యుడైన హసన్ నైతిక విలువలతో ఉదాత్తమైన నడవడికను అలవర్చుకున్నవాడు.