కలవాడని తెలుస్తుంది. విద్యాధికుడు, తెలివిపరుడు, నైతిక ప్రవర్తన కలవాడు, మత్తు పదార్థాలకు హేయమైన సంతోషాలకు దూరంగా వుంటాడు. ఆ కాలపు చరిత్రకారులకు, రచయితలకు సమకాలికుడైన రచయిత అలీ హుసేని అల్కా కైల్వి (Ali Hussaini Alkoh Kailvi) అబుల్హాసన్ అంటే ఆరాధ్య భావం కలిగి, హసన్ దైవభీతి కలిగిన ఆధ్యాత్మిక స్వభావి, క్రమం తప్పకుండా ప్రార్థనలు చేసేవాడు, ఆచార వ్యవహారాలను పాటించే శిష్ట వ్యవహారి అంటాడు. పవిత్రమైన ఖురాన్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఏడు విధాలుగా ఉచ్చరిస్తూ గానం చేయగల నిష్ణాతుడు. ఖురాన్ కళాత్మక ఉచ్చారణలోని వివిధ శైలి, రీతులను గ్రంథస్తం చేయవలసిందిగా రచయితను కోరేవాడు. నేను రాజులో భగవద్రూపాన్ని చూసేవాడ్ని. దేవ దూతలు సంరక్షిస్తుండగా, నిశ్చలంగా దృఢసంకల్పంతో సత్య మార్గంపై పయనిస్తూ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, సత్య ధర్మాలను ఆచరించే ప్రజలకు, సరియైన మార్గాన్ని, సరియైన మార్గదర్శకత్వం చేస్తూ మోక్షమార్గంలో నడిపించే వాడు. "యథారాజా తథాప్రజ" అన్న నీతి సూత్రాన్ని నిజం చేస్తూ అన్ని తరగతుల ప్రజల ఉన్నతమైన, ఉదాత్తమైన ధర్మ మార్గంలోనే నడిచేవాడు. హసన్ గొప్పతనానికి, సత్యశీలతకు, స్వచ్ఛమైన వ్యక్తిత్వానికి ఇదొక గొప్ప సాక్ష్యం. కాని ప్రారంభ దశలో భవిష్యత్తుపై నిరాశాజనకమైన దృక్పథంతో, ఆ కాలంలో ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక వేత్త షా రాజు ఖట్టల్ (Shah Raju (Qattal) ను ఆశ్రయించి సన్యాసి జీవితం గడుపుతూ తన పూర్తి జీవితాన్ని ఆశ్రమానికి అంకితం చేయాలను కున్నాడు. ఈ కారణాల ప్రభావంతో అబ్దుల్లా, అతని గురించి చాలా కొద్దిగా తెలిసి, అసలు నిజాలు తెలియక తన కుమార్తె నివ్వాలని కలలో కూడా ఊహించలేదు. కొన్ని అసాధారణమైన పరిస్థితులలో రాజు, అబుల్ హసన్ గురించి విపులంగా విచారించి రాజభవనంలోని ముఖ్య వక్తులద్వారా సేకరించిన, వారు తెలిపిన విషయాలను గ్రహించి చివరికి రాకుమారిని అతనికిచ్చి వివాహం జరిపించాడు. సామాజిక, రాజకీయ శక్తుల మార్పులతో అసాధారణమైన పరిణామాలు తలెత్తు తున్నాయి. అబుల్ హసన్తో వివాహం జరిగిన రాకుమారికి వాస్తవంగా నాటకీయ పరిస్థితులలో ఇదివరకే హెజాజ్ వంశానికి చెందిన ఒక విదేశీయ వ్యక్తి సయ్యద్ సుల్తాన్ తో నిశ్చితార్థం జరిగిపోతుంది. సయ్యద్ సుల్తాన్ కూడా రాజు అబ్దుల్లా పెద్దల్లుడు సయ్యద్ అహ్మద్ తరహాలో వ్యాపార నిమిత్తం గోల్కొండకు వచ్చి ఉన్నత వర్గానికి చెందిన కుటుంబ నేపథ్యంతో రాజు దృష్టిని ఆకర్షిస్తాడు. సయ్యద్ అహ్మద్ ఇతన్ని స్వాగతించి రాజుకు పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర
పుట:గోల్కొండ చరిత్ర.pdf/211
స్వరూపం