విషయం ప్రస్తావన వస్తుందో అప్పుడు అబ్దుల్లా తన కాబోయే అల్లుడు అబుల్ హసన్ వంశ మూలాల మీద ఆరా తీస్తాడు. ఆ సందర్భంలో రాజ అంతఃపురంలో వుండే మా బానో (Mah Bano), సరూమా (Saruma) అనే పెద్ద వయసు గలస్త్రీలు కుటుంబ చరిత్ర మీద అవగాహన కలిగిన వారు రాజు అబ్దుల్లాకు “అబుల్ హసన్, కుతుబ్ షాహి వంశానికి చెందిన సైఫ్ ఖాన్ ఐనుల్ ముల్క్ మనవళ్ళలో ఒకడు అని భరోసా ఇస్తారు. అందుకే హసన్ ఈ పెళ్ళికి తగిన వరుడే అని భరోసా ఇచ్చి అబ్దుల్లాకు ధైర్యం కలిగిస్తారు. ఈ వివరణతో అబుల్ హసన్ వంశ మూలాలపై వున్న అనేక సందేహాలు, అపోహలు తొలిగి ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఫతిఖాన్ కుమారుడైన సైఫ్ ఖాన్ ఐనుల్ ముల్క్ కు అబుల్ హసన్ మనవడు అన్న ముగింపుకు వస్తారు. ఫతిఖాన్, సుల్తాన్ కులీ కుతుబ్ షాకు దగ్గరి బంధువు కావడంతో హసన్ నిస్సందేహంగా కుతుబ్షాహీ వంశానికి దగ్గరి సంబంధీకుడు అన్న నిర్ధారణకు వస్తారు. ఇదే వాస్తవాన్ని డచ్ యాత్రికుడు హ్యూబర్ట్ వివరణ కూడా బలాన్ని చేకూరుస్తుంది. హ్యూబర్ట్ ప్రకారం "అబుల్ హసన్ కుతుబ్ షాహి వంశస్తుడని, ఇబ్రహీం కుతుబ్ షాతొ మూలాలున్నాయని వ్యాఖ్యానిస్తాడు. అందుచేత తరువాత పరిశోధనలు చేసిన చరిత్రకారులంతా అబుల్ హసన్, రాజు అబ్దుల్లా కుతుబ్ షాకు దగ్గరి బంధువని వర్ణిస్తారు.
కుతుబ్ షాహి రాజులకు బంధువు ఐనప్పటికీ, అబుల్ హసన్ కు ఆ స్థాయి, హోదా, గుర్తింపు కాని, మర్యాద కాని ఇవ్వబడలేదు. దర్బార్లోకి, రాజ భవనంలోకి ప్రవేశార్హత కూడా లేకుండే. కారణాలు వెతికితే - హసన్ హైదరాబాద్ లొనే ఒక మతానికి చెందిన ఆశ్రమంలో ఆడంబరమైన రాజసం జీవితానికి దూరంగా వుంటూ సన్యాసి జీవితాన్ని గడుపుతున్నాడని, ఫలితంగా రాజు అబ్దుల్లా, అతనంటే అంతగా ఆసక్తి చూపేవాడు కాదని, ఖఫీ ఖాన్ వ్యాఖ్య. అంతేగాక అతని చెడు ప్రవర్తనల కారణంగా రాజు అయిష్టత చూపేవాడని తెలుస్తుంది. టావెర్నియర్, ఒక అడుగు ముందుకు వేసి అబుల్ హసన్ "స్త్రీ లౌల్యం కలవాడని, దాని కారణంగా రాజు తన కూతురు వివాహం అతనితో ససేమిరా ఒప్పుకోలేదని చెబుతాడు. కేవలం వివాహం తరువాత హసన్ తన ప్రవర్తనను మార్చుకున్నాడంటారు. కాని అబుల్ హసన్ విషయంలో ఇవేవీ వాస్తవాలు కావు. దృవీకరించబడినటువంటి నిజాలు కావు. వాస్తవానికి అబుల్ హసన్ ఇలా దిగజారుడుతనానికి జారిపోయే వ్యక్తి కాదని, మితాహారంతో మద్యపానానికి దూరంగా వుంటూ పవిత్రంగా జీవితాన్ని గడిపే వ్యక్తి. 'మహానామ' లోని విషయాలను నమ్మితే హసన్ పండిత జ్ఞానం కలిగి, దైవ భీతి