4. గిరిధారి లాల్ చే రికార్డు చేయబడిన అసలైన ఒప్పంద పత్రంలో నగదు తగ్గింపు ప్రస్తావన లేదు. Ahqar మాటల్లో “తమ విధేయుడైన సేవకుడు, గౌరవపూర్వకంగా ఇరవై వేల హుణాలు సమర్పించుకుంటున్నాడు. దీనికి తోడు విలువైన ఆభరణాలు, ఉత్తమ జాతికి చెందిన ఏనుగును కూడా సమర్పించు కుంటున్నాడు. చక్రవర్తి ప్రభుత్వానికి అవసరమైన సందర్భంలో, ఐదు వేల గుర్రాలను అందివ్వడానికి సిద్దంగా వుంటాం” అని వివరిస్తాడు.
5. గోల్కొండ సింహాసనానికి తన తదుపరి వారసుడిగా మహమ్మద్ సుల్తాన్ యని రాజు చేసిన అంగీకార పత్రం వాస్తవమేనని యాత్రికులు - మనుచి, బెర్నియర్, టావెర్నియర్లు ఈ విషయాన్ని బలపరుస్తారు.
6. ముందుగా ఒకసారి దౌలతాబాద్ పై మహాబతాఖాన్ దాడి చేసినప్పుడు రాజు అబ్దుల్లా నిష్క్రియాత్మకమైన వైఖరిని అవలంభించాడు. ఐనా చివరికి సహకరించడానికి సమ్మతింపజేశారు. ఈ వైఖరికి విరుద్దంగా, బీజాపూర్ ఎల్లప్పుడూ దక్కన్ రాజ్యాలకు ఏ విధమైన సమస్య, ఆపద వచ్చినా దక్కన్ రాజ్యాల సమగ్రత విపత్తులోనున్నా, విధిగా ఆదుకోవడానికి, సహాయ మందించడానికి మనఃస్ఫూర్తిగా ముందుకు వస్తుంది. సైన్యం కాని, సామాగ్రి ఏదైనా రాజకీయ, నైతిక బలాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి, మహాబత్ ఖాన్కు వ్యతిరేకంగా నిలబడడానికి సహకారం అందిస్తుంది. మహమ్మద్ ఆదిల్ షా, గోల్కొండ రాజకుమారి ఖదీజా సుల్తానాను 1633 A.D. (1043 A.H.) లో వివాహమాడాడు. ఏ ఉద్దేశంతో వివాహం జరిపించారో ఆ ఉద్దేశం నెరవేరడం లేదు. మొఘలుల పెరుగుతున్న ప్రాబల్యానికి దాదాపుగా రాజు అబ్దుల్లా, లొంగిపోయినట్లుగా భావించి ఎటువంటి సహాయాన్ని అందించడానికి నిర్లక్ష్యం చూపసాగాడు. ఖదీజా సుల్తానా, "హాజి బడే సాహిబ్" గా ప్రసిద్ధిపొందిన ఈమె, అలీ ఆదిల్ షా-IIకు రాజకీయ, నైతిక బలం. సదా వెన్నంటి వుండి రెండు రాజ్యాలమధ్య సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందనగా తను నిలబడి సమస్యను పరిష్కరించగలిగే సాహస మహిళ.