Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తన శక్తివంతమైన సైనిక దళాన్ని బీజాపూర్ ప్రసిద్ద జనరల్ ఖవాస్ ఖాన్ నాయకత్వంలో సిద్దం చేశాడు. మొఘల్ జనరల్ యుద్ధ రంగంలోకి దిగడానికి ముందుగానే 1665 A.D. (1076 A.H.) లో ఖవాస్ ఖాన్, శివాజీని పరాజితుడిని చేశాడు. బీజాపూర్ దాడులతో అలసిపోయిన శివాజీ మరో మార్గం లేక తన సేనను లొంగిపొమ్మని ఆదేశించి మొఘల్ నిర్దేశించిన షరతులను అంగీకరించాడు.

ఈ సందర్భంలో ఒక జుగుప్సాకరమైన స్థితి ఉత్పన్నమైంది. మొఘల్ సేన, బీజాపూర్ పక్షం నుండి ఎలాంటి తప్పు లేకుండానే బీజాపూర్ రాజ్యంపై దాడికి ఉపక్రమించింది. మొఘల్ సమస్య నుండి స్వతంత్రుడు కాగానే శివాజీ బీజాపూర్ ను మైత్రిపూర్వక పాత సంబంధాలను పక్కన పెట్టి పరిసమాప్తి చేయవలసిందిగా జయసింగ్ ను ఒప్పిస్తాడు. దూరదృష్టిలేని జయ సింగ్ బీజాపూర్ కు వ్యతిరేకంగా శత్రువైఖరిని అవలంబిస్తాడు. ఇది ఖచ్చితంగా మొఘల్ చక్రవర్తితో కుదిరిన ఒప్పందానికి, మిత్రత్వానికి విరుద్ధమే గాక మొఘలుల అవసరానికి సహకరించి ఆదుకున్న మిత్రరాజ్యం బీజాపూర్ కు దురదృష్టకరమైన అనుభవం. శివాజీ పైకి దండెత్తిన మొఘల్ సేన తన వక్రబుద్ధితో బీజాపూర్ పై దాడి చేయడం విధి వైచిత్రి అని చెప్పవచ్చు.

బీజాపూర్ రాజ్యానికి ఇప్పుడు రెండు విధాలుగా విపత్తును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. కానీ అలీ చాలా చురుకైన రాజకీయ చతురుడు. పైగా ధైర్య సాహసాలు కలిగిన యోధుడు. అతనికి సమ ఉజ్జీలైన జనరల్స్ ఖవాస్ ఖాన్, సయ్యద్ ఇల్యాస్ మొఘల్లలకు దీటైన శూరులు. ఈ సమయంలో గోల్కొండ ఒక మౌన ప్రేక్షక పాత్ర వహించదల్చుకోలేదు. ఈ క్లిష్టసమయంలో తన వంతు సహకారం అందించాలనే తపనతో మనఃస్ఫూర్తిగా దక్కన్ రాజులమధ్య సహకారానికి అనుకూలంగా స్పందించింది. షార్జా ఖాన్ (Sharza Khan) నేతృత్వంలో పెద్ద సైనిక దళాన్ని, అదనంగా పన్నెండు వేల గుర్రాలు కలిగిన అశ్విక దళాన్ని, నలభైవేల సైనికులతో కూడిన కాల్బలాన్ని నేఖ్ నామ్ ఖాన్ నాయకత్వంలో బీజాపూర్ మనోబలాన్ని, సైనిక బలాన్ని బలోపేతం చేయడానికి పంపించాడు 6. 1666లో ఇరు వర్గాలమధ్య జరిగిన ఐదు యుద్ధాలలో జయ్సింగ్ ఓటమి పాలై అవమానకరమైన అనుభవంతో కాలికి బుద్ది చెప్పాడు. అటు పిమ్మట అవమానం భరించలేక 1667 A.D. లో గుండె పగిలి మరణించాడు. మొఘల్ ప్రభుత్వం సృష్టించిన అనేక ఒడిదుడుకుల మధ్య సాధించిన ఈ విజయం ఓ అద్భుతమైన సందర్భం. ఈ ఘటన సుసంపన్నంగా, ఆనందకరంగా సాగిన 'మాలిక్ అంబర్' రోజులను జ్ఞప్తికి తెస్తాయి. ఈ విజయం