Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యువరాజుకు సంక్రమిస్తాయని ప్రకటిస్తున్నాను. రెండవది, వీటికి తోడుగా రెండు లక్షల యాభైవేల హున్స్, రామగిరి కోట, దాని పరిసర ప్రాంతాలు మొఘల్ సామ్రాజ్యం నియమించిన ప్రతినిధులకు అప్పగించడం జరుగుతుంది”.

చక్రవర్తి ఆదేశానుసారం 14th, జమాది-II (14th Jamadi-II) రోజున మొఘల్ సేనను కోట నుండి ఉపసంహరించు కున్నారు. గోల్కొండ రాకుమారి పాదుషా బీబీ (Badshah Bibi) వివాహం ఐదు రోజుల తరువాత మహమ్మద్ సుల్తాన్తో జరుగుతుంది. రామగిరి జిల్లా ను కట్నం రూపేణా ఇవ్వడం జరుగుతుంది (రామగిరి హైద్రాబాద్కు ఈశాన్యంలో 113 మైళ్ళ దూరంలోవుంది). వివాహం జరిగి పెళ్ళికొడుకుతో ఆగ్రా వెళ్ళిపోయిన తరువాత రాకుమారి పాదుషా బీబీ గురించిన సమాచారం ఎవరికీ తెలియదు. మహమ్మద్ సుల్తాన్కు తండ్రితో కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు కలగడంతో, తండ్రి కోపానికి గురై జీవిత ఖైదు చేయగా 1677 A.D. (1088 A.H.)లో కారాగారంలోనే సుల్తాన్ మరణించాడు. బహుశా రాకుమారి కూడా నిర్బంధంలోనే హింసకు గురై భర్త యువరాజు సుల్తాన్ కన్నా ముందు లేదా తరువాతనో మరణించి వుండవచ్చు. రాజు అబ్దుల్లా తయారు చేసిన ప్రత్యేకమైన రాజముద్ర ఒక విశేషణమైన పదబంధం "శాంతియుతమైన, ఆనందకరమైన ముగింపుకు చేరుకున్నాము”. చరిత్రలో మరిచిపోలేని 'స్మృతి వాక్యం'గా మిగిలిపోయింది. ఈ వాక్యంలోని గూఢార్థం బహుశా - దురాక్రమణ దారులచేతిలో ముక్కలవకుండా రాజ్యం ఒక జాతీయ విపత్తు నుండి ముక్తి పొందింది. అటు పిమ్మట రాజశాసనాలు, జారీ చేయబడిన అధికారిక పత్రాలు మొదలగు వాటిమీద ఈ వాక్యం వున్న ముద్రను ముద్రించేవారు.

నమ్మక ద్రోహ ఫలితంగా ఉత్పన్నమైన దుష్పరిణామాలు, ఫలితంగా సృష్టించబడిన భయానక సంఘటనలతో కుతుబ్ షాహీ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం ముగిసింది. అవిధేయత, నమ్మక ద్రోహం, కుట్రలు గోల్కొండ చరిత్రకు అనుభవంలో లేనివేమీ కాదు. జమీద్ పాలనలో జగదేవ్ రావు, సైఫ్ ఖాన్ ఐనుల్ ముల్క్, సుల్తాన్ మహమ్మద్ పాలనలో మాజీ మీర్ జుమ్లా ఐన మహమ్మద్ అమీన్ అవసరమనుకున్న సమయంలో వెన్నుపోటు పొడిచి, శత్రువులతో చేయి కలిపి మోసాలకు పాల్పడినా, రాజ్య ప్రతిష్ట, గౌరవం, మర్యాదలభంగపాటుకు అంతగా నష్టం వాటిల్లలేదు. రాజ్య వైభవం సన్నగిల్లలేదు. వీటికి విరుద్ధంగా మహమ్మద్ సయీద్ చేసిన ద్రోహం వలన రాజ్యం తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. తీవ్రమైన నష్టం జరిగి సార్వభౌమాధికారం కోల్పోయి, రాజకీయ ప్రతిష్ట దిగజారి