Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చావుదెబ్బ తిన్నాడు. మూసా ఖాన్ తన స్థానాన్ని తీసుకుని చివరి వరకు బురుజ్ ను కాపాడుతూ వచ్చాడు". యుద్ధం చివరికి ఎటు దారి తీస్తుందో తెలియని అయోమయ స్థితి. రాజు అబ్దుల్లా చివరికి తన మనోబలాన్ని కోల్పోయి కాళ్ళ బేరానికి వచ్చాడు. తన వర్తమానాన్ని, కానఔరంగజేబు జేష్ట పుత్రుడు, అధిష్టించాలని రాయించడం జరిగింది. ఈ అంశం మొఘల్ చుకలను ఔరంగజేబుకు పంపించి శాంతింప జేసేలా యత్నాలు చేశాడు. కానీ ఔరంగజేబు రాజు కోరికను పెడచెవిన పెట్టి కుతుబ్షాహి వంశ నాశనానికే పూనుకున్నాడు. సర్దుబాటు చేసుకుని శాంతి నెలకొల్పాల్సిందిగా మొఘల్ ప్రభుత్వమిచ్చిన ఆదేశాలను కూడా దాచిపెట్టి యుద్ధాన్ని కొనసాగించాడు. అబ్దుల్లా, తన అల్లుడు సయ్యద్ అహ్మద్ (Syed Ahmed) మీర్ ఫసీని (Meer Faseeh) మహ్మద్ సుల్తాన్ వద్దకు పంపి తన కోరికను విన్నవించుకున్నాడు. చివరికి రాజు అబ్దుల్లా ముదుసలి తల్లి హయత్ బక్షీ బేగం (Hayath Bakshee Begum) దిగి వచ్చి తాను వ్యక్తిగతంగా విన్నవించుకుని తన పక్షం నుండి స్వయంగా ఒత్తిడిని పెంచి ప్రార్థించింది. చివరికి ఔరంగజేబు నుండి అనుకూలమైన సంకేతాలు అందడంతో ఆమె తన విన్నపంతో ఔరంగజేబును సంప్రదించింది. మొఘల్ అధికారుల జట్టు ఒకటి ఆమెకు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికి షైయిస్తాఖాన్ (Shaista Khan) క్యాంపుకు తీసుకువెళ్తారు. హయత్బక్షీ బేగం వ్యక్తిగత విన్నపం ప్రభావం, ముందుగానే కేంద్రం నుండి అందిన ఆదేశాలఫలితంగా శాంతి ఒప్పందాలకు చివరికి అంగీకరించి కోటపై ఆక్రమణను నిలిపివేయడంతో మంచి ఫలితాలు అంది యుద్ధం ఆగిపోవడం జరిగింది. ముందుగా ప్రస్తావించిన విధంగా గోల్కొండ రాకుమారిని మహమ్మద్ సుల్తాని కిచ్చి వివాహం జరిపించడం, కోటి రూపాయలనగదు చెల్లింపు, విలువైన ఆభరణాలు, ఏనుగులు ఇత్యాది ముట్ట జెప్పే విధంగా ఒప్పందం కుదిరింది. కాని రాజమాత విన్నపాన్ని మన్నించి నగదు కోటి రూపాయలనుండి డెబ్భై లక్షలకు తగ్గించడానికి చక్రవర్తి అంగీకారం కుదిరినట్లు చరిత్రకారుల వ్యాఖ్యానం. ఒప్పంద పత్రంలో, గోల్కొండ ప్రస్తుత రాజు మరణానంతరం గోల్కొండ సింహాసనంపై మహమ్మద్ సుల్తాన్, చక్రవర్తికి తెలియపర్చకపోయినా ఒప్పంద పత్రంలో జొప్పించారు. పత్రంలోని విషయ వివరణ ఇలా సాగుతుంది:-

"నేను మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను; యువరాజైన మహమ్మద్ సుల్తాన్కు నా స్వంత కూతురునిచ్చి వివాహం జరిపించుట, అల్లాహకు ప్రియమైన ఈ రాజు మరణానంతరం రాజ్యపు సార్వభౌమాధికారం అల్లాహ్ కృపకు పాత్రుడైన