ఉన్నత వర్గాలకు చెందిన వారి, ధనవంతులనివాసాలను ఇష్టం వచ్చిన రీతిలో దోచుకోసాగారు. మొఘల్ ప్రిన్స్ ఈ ఉపద్రవాన్ని ఆపుటకు ప్రయత్నించి విఫలమయ్యాడు. నగరంలో చెలరేగిన అల్లర్లను నియంత్రించుటకు ప్రత్యేకంగా మహమ్మద్ బేగ్ అనే సైనికాధికారిని కూడా నియమించాడు. అయినా ఫలితం దక్కలేదు. ఈ దోపిడీ, అల్లర్లలో మొఘల్ సైన్యం ప్రమేయమే అధికంగా వుండేది. రాజు అబ్దుల్లా శాంతి కోసం అనేక ప్రయత్నాలు చేయసాగాడు. యుద్ధం కారణంగా జరిగిన వాటిని నష్టపరిహారంగా నలభై లక్షలనగదును ఇవ్వడానికి, ప్రిన్స్‌కు రాజు తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించుటకు కూడా ఒప్పుకున్నాడు. కానీ ప్రిన్స్ ఇవేవీ తన అధికార పరిధిలో లేవని తేల్చి చెప్పడంతో మధ్యవర్తిత్వం, శాంతి ప్రయత్నాలు డోలాయమాన స్థితిలోనే వుండిపోయాయి. మొఘల్ రాజ్యం, అబ్ధుల్లా పై ద్వంద్వ వైఖరి చూపిస్తున్నాడని తీవ్రమైన విమర్శలు చేసింది. ఒక వైపు శాంతి ప్రయత్నాలంటూ మధ్యవర్తిత్వం నెరుపుతూ, మరోవైపు యుద్ధ సన్నాహాలు చేస్తున్నాడని ఆరోపించారు. పరిస్థితులను పక్షపాత రహితంగా అంచనా వేస్తే, రాజు అబ్దుల్లా ఒకవేళ శాంతి ప్రయత్నాలు విఫలమైతే ముందు జాగ్రత్తగా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనుటకు తగిన చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదు. అతను నిజాయితీ గానే శాంతి కోసం ప్రయత్నాలు కొనసాగించాడు. స్వీయ రక్షణ ఎవరికైనా అవసరమే. అనుకోని పరిస్థితుల్లో యుద్దమే సంభవిస్తే అబ్దుల్లా రాజు బీజాపూర్ నుండి సహాయాన్ని కూడా ఎదురు చూశాడు.
చిన్నపాటి వివాదాలు మినహా ఔరంగజేబు వచ్చేవరకు ఎలాంటి పెద్ద పోరాటాలు ఇరు సైన్యాలమధ్య సంభవించలేదు. ఔరంగజేబు 6 ఫిబ్రవరికి హైదరాబాద్ చేరుకున్నాడు. 7 ఫిబ్రవరిన కోటపై దాడి జరిపాడు. 30 మార్చి వరకు దాడి కొనసాగుతూనే వుంది. ఆక్రమణ చివరి రోజున మహమ్మద్ సయీద్ కర్నాటక నుండి తిరిగి వచ్చి, మొఘల్ సేనలతో కూడి తన కోరికను సంపూర్ణం చేసుకోదలిచాడని మనుచి (Manucci) వివరించాడు. ఈశాన్యం (NE) లో వున్న కొండ వ్యూహాత్మకమైన బిందువుగా మారి మొఘల్ సేనకు, కోటపై ప్రత్యక్ష దాడికి అనుకూలంగా మారి కుతుబ్ షాహి రక్షణ దళానికి తలనొప్పిగా మారింది. గోల్కొండ సేన ఒకటికి రెండుసార్లు గట్టి పోటీ ఇచ్చినా మొఘల్ సేన ముందు నిలవలేక పోయారు. మీర్మీరన్ (Meer Meeran), మూసా ఖాన్ (Musa Khan)ల పర్యవేక్షణలో వున్న మూసాబురుజ్ (Musa Buruz)కు రక్షణ పరంగా చాలా ప్రాముఖ్యం వున్నది. ఈ బురుజ్ లోనే తుపాకీ గుండు దెబ్బకు మీర్ మీరన్