మార్గంగా భావించాడు. ఒకవేళ మానుచి (Manucci) వివరణను నమ్మితే, సయీద్ నిజానికి ఔరంగజేబును, గోల్కొండ పైకి ఆక్రమణకు ప్రేరేపించాడని, అందుకు తన ఆధీనంలో వున్న నలభై వేల అశ్విక బలాన్ని ఈ కార్యానికి ఉపయోగించగలనని వివరిస్తాడు. తవర్నియర్ ప్రకారం, మహమ్మద్ సయీద్, బెంగాల్ అధిపతి ఐన షుజా (Shuja) నుకు గోల్కొండపై దాడికి రెచ్చగొట్టాడని అందుకు తనవంతు సహాయం చేయగలనని చెప్పాడని వివరిస్తాడు. ఐతే సయీద్ విన్నపానికి స్పందిస్తూ, మొఘల్ చక్రవర్తి వెంటనే సహాయానికి తమ సామ్రాజ్యపు సమ్మతిని 3, డిసెంబర్, 1655 A.D. (1066 A.H.)న తెలిపినట్లు అందుకు వర్తమానాన్ని మహమ్మద్ ఆరీఫ్ కశ్మీరి (Mohd Arif_Kasmiri) ద్వారా పంపినట్లు, అలాగే సమ్మతికి సంకేతంగా గౌరవార్థకమైన రాచ దుస్తులను పంపిస్తూ వాటితోటి ఐదువేల అశ్విక దళాన్ని పంపి ఆ దళానికి అతను అధిపతిగా, రెండు వేలతో కూడిన అశ్విక బలానికి సయీద్ కుమారుడు అమీన్ అధిపతియని సమాచారాన్ని కూడా పంపినట్లు తెలుస్తుంది. అలాగే రాజు అబ్దుల్లాకు గోల్కొండలో నివసిస్తున్న సయీద్ కుటుంబ సభ్యులను గౌరవంగా, స్వేచ్ఛగా వుండేటట్లు సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు పంపించడం జరిగింది.
మహమ్మద్ అమీన్ అవివేకపు చర్యతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. చక్రవర్తి ఫర్మానా సయీద్, రాజు అబ్దుల్లాకు చేరకముందే మహమ్మద్ అమీన్ తన తండ్రి బలాన్ని మొఘలుల అండ చూసుకొని పొంగిపోయి, అడ్డు అదుపు లేకుండా పొగరు బోతుతనం, అహంకారంతో రాచ మర్యాదల్ని, సామాజిక ప్రవర్తనను, రాజదర్బారులో ప్రవర్తించే తీరును మరిచి, తానే అధికుడన్న మదంతో అన్ని హద్దుల్ని దాటాడు. ఒకరోజు బాగా మద్యం సేవించి ఒంటిపై సోయి, స్పృహ లేకుండా దర్బారు హాల్లోకి ప్రవేశించి రాచవేదిక మీదనే పడిపోయి వాంతి చేసుకున్నాడు. దర్బారు హాల్లో రాచమర్యాదలను అతిక్రమించి, అవమానకరంగా, అసహ్యంగా ప్రవర్తించడం, పెద్ద నేరంగానే పరిగణింపబడి తన రాజ ప్రతిష్టను నిలబెట్టుకోక తప్పక క్రమశిక్షణ చర్యకు రాజు పూనుకున్నాడు. ఫలితంగా రాజు అమీన్ ను బందీ చేయవలసిందిగా ఆజ్ఞాపించి, అప్పుడే చక్రవర్తి ఆదేశాలను అందుకున్న వాటిని బేఖాతరు చేస్తూ అమీన్ ఆస్తులను కూడా జప్తు చేయవలసిందిగా ఆదేశించాడు. ఈ చర్యను మొఘలు ప్రభుత్వం తీవ్రమైన ప్రతికూల వైఖరిగా పరిగణించి చక్రవర్తి ఫర్మానాను ధిక్కరించిన నేరానికి అబ్దుల్లా రాజుకు తగిన గుణపాఠం నేర్పించాలని నిర్ణయించింది. ఫలితంగా చక్రవర్తి, అమీన్‌ను వెంటనే విడుదలచేయవలసిందిగా,