Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరుద్దమే గాక బీజాపూర్ కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ చర్య అనైతికతకు నిదర్శనం. బీజాపూర్ కుదిరిన ఒప్పందం, గోల్కొండకు కూడా సమానంగా వర్తిస్తుంది.

మహమ్మద్ సయీద్ కు అనుకూలంగా మొఘల్ సామ్రాజ్యం స్పందించడంతో సహజంగానే గోల్కొండతో బాటు బీజాపూర్ రాజ్యానికి కూడా భయ ప్రకంపనలు వ్యాపించాయి. అందుకు ఇరు రాజ్యాలు చక్రవర్తిని ప్రశంసిస్తూ పొగడ్తలతో తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసినా అవన్నీ వృథా అయ్యాయి. మహమ్మద్ సయీద్ గనక తమ రాజ్యాన్ని వదిలి అన్ని రహస్యాలను మొఘల్ చక్రవర్తి దగ్గర బహిర్గత పరిస్తే వినాశనానికే దారి తీస్తుందన్న ఆలోచనే వణికించింది. కాని సయీద్ డబుల్ గేమ్ ఆడాడు. అతనెప్పుడూ తనకు తానుగా మొఘలుల చెంత పాదాక్రాంతుడు కావాలన్న విషయాన్ని గంభీరంగా ఆలోచించలేదు. అతను తన కుట్రపూరితమైన వైఖరితో అటు ఆదిల్ షాహిలను, ఇటు షాజహాన్ ను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. సయీద్ అసలు వుద్దేశం కాలయాపన చేస్తూ గోల్కొండకు ప్రతిగా తన స్థానాన్ని పదిల పరుచుకోవడానికి, మొఘలుల సంరక్షణ తనకుందంటూ గోల్కొండ రాజును మభ్యపెడుతూ నాటకమాడుతున్నాడు. తెర వెనుక నాటకాలభాగోతం, మొఘల్ రాయబారి మహమ్మద్ మోమిన్ పసిగడ్తాడు. ఇతను కర్నాటక యాత్ర తర్వాత చక్రవర్తికి అసలు విషయాన్ని, వాస్తవాలను బయటపెడ్తాడు. అంతేగాదు, సయీద్ వ్యక్తిగతంగా తాను ఔరంగజేబుకు స్నేహపూర్వకంగా రాసిన ఉత్తరాల్లో ఈ విషయం ప్రస్ఫుటమవుతుంది. ఒక ఉత్తరంలో "నేనొక వేళ కుతుబ్ - వుల్ ముల్క్ (Qutubul Mulk) సేవలో వుండాలా? రాజకీయాలనుండి విరమించుకోవాలా? లేదా పవిత్ర నగరాల సందర్శనాలలో జీవితాన్ని తరింప జేసుకోవాలా? అన్న విషయంలో రెండు సంవత్సరాలలో నేనొక నిర్ణయం తీసుకుంటాను” అని సయీద్ రాస్తాడు. ఇంకా గోల్కొండలోనే వున్న సయీద్ కుమారుడు మహమ్మద్ అమీన్ స్వయంగా మొఘల్ హజీబ్, మొహమ్మద్ మోమిన్ ను శాంత పరచడానికి ప్రయత్నిస్తూ, తన తండ్రి కాలయాపనగా ఈ మంత్రాంగం నడుపుతున్నాడు కాని వాస్తవానికి మేమిద్దరం మొఘల్ చక్రవర్తి సేవలో తరించడానికి ఉత్సుకతతో వున్నామని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు అని వివరించాడు. మహమ్మద్ సయీద్ మనసులో ఎలాంటి ఆలోచనలు వున్నాయో, లోలోపల అతను ఎలాంటి పన్నాగాలు వేస్తున్నాడో వారికి తెలియని విషయం కాదు. నిజానికి సయీద్ గోల్కొండ, బీజాపూర్ రాజులచేతిలో తన నాశనం తప్పదని మొఘల్ రక్షణను చివరి -