Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుండేది. ఇతని ధాటికి యూరోపియన్ వర్తకులు కూడా భయపడి గవర్నర్ ను (సయీద్) సంతోషపర్చడానికి నగదును, విలువైన బహుమతులను అందజేసేవారు. డామ్ ఫిలిప్ (Dom Filippe Mascarenhas), పోర్చుగీస్ ప్రాంతపు గవర్నర్ అతనికి అసాధారణమైన, విలువైన వస్తువులు బహుమతులుగా ఇచ్చాడు. ఆంగ్లేయ వర్తకులు అతని నుండి 'కౌలు' పొందడానికి తుపాకులు, ఇతర సామాగ్రి బహుకరించారు.

దక్షిణ భూభాగంలో ఎదురు చూడని విజయాలు, పోగైన అపార ధన సంపద, అతని అహంకారాన్ని పెంచి అర్థంలేని ధైర్యాన్ని పెంచింది. దానితో, అతనిలో కేంద్రానికి విరుద్దంగా తనదైన ప్రత్యేకమైన, సుస్థిరమైన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాలన్న దురాలోచన కలిగింది. దక్షిణాన జరిపిన దాడులు, యాత్రలఫలితంగా పోగైన సంపదను అప్పజెప్పడానికి నిరాకరించడంలోనే అతని అవిధేయత, వైఖరి తేటతెల్లమయ్యింది. అదంత తన శ్రమ ఫలితమని, తనకే స్వంతమని, ఆ సంపదపై తనకే అధికారముంటుదని అసమంజసమైన దావా చేశాడు. అతని ప్రవర్తనతో ఆందోళనకు గురైన రాజు, రాజధానికి తిరిగి రావలసిందిగా కబురంపాడు. దూరప్రాంతంలో నున్న నమ్మక ద్రోహి గవర్నర్ ను హద్దులో పెట్టడం కష్టమని, రాజధానికి రావడం వలన అక్కడే అతన్ని బందీ చేయవచ్చన్న తలంపుతో రాజు ఈ ఉపాయాన్ని పన్నాడు. రాజు ఆదేశం ప్రకారం మహమ్మద్ సయీద్ రాజధానికి వెళ్ళి మర్యాద పూర్వకంగా రాజదర్బారులో హాజరయ్యాడు. కాని అపాయాన్ని పసిగట్టిన సయీద్ అక్కడి నుండి వెంటనే పరారయ్యాడు. రాజు, శిక్ష నెపంతో అతన్ని రహస్యంగా గుడ్డివాన్ని చేయడమో లేదా విషప్రయోగం జరిపించడమో యోచనలో వున్నట్లు యోచనలో వున్నట్లు టావెర్నియర్ (Tavernier) వ్యాఖ్యానం. సయీద్ తన గుర్రాన్ని సైగ చేసి పిలిపించి హడావుడిగా తన ప్రాంతానికి పారిపోయి అక్కణ్నుంచి బహిరంగం గానే కేంద్రానికే సవాలు విసిరాడు. సయీద్ తన దగ్గర వున్న సైనిక బలం, సంపదతో స్వతంత్రంగా, శక్తివంతమైన కేంద్రాన్ని ఎదుర్కోవడానికి ఎంత మాత్రం సరితూగదు. అందుకే అతను బయటి నుండి సహాయానికై ప్రయత్నాలు ప్రారంభించాడు. తన ఆలోచన ఎంత వరకు ఫలిస్తుందో చూడాలనుకుని విదేశీ రాజ్యాలైన పర్షియా, బీజాపూర్, ఢిల్లీకి సహాయం కోసం అర్థిస్తూ ఉత్తరాలు రాశాడు. అందుకు పర్షియా, బీజాపూర్ అనుకూలంగా స్పందించలేదు. కాని మొఘల్ హజిబ్ (Mughal Hajib) ఐన అబ్దుల్ లతీఫ్ (Abdul Lateef) మాత్రం సయీద్ ఉత్తరాన్ని వెంటనే ఔరంగజేబుకు పంపగా అతను ఉత్తరాన్ని సమర్థిస్తూ చక్రవర్తికి పంపాడు. రాజకీయ నైతికతకు ఇది