ఉత్పన్నమైన సమస్యలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవడం అంత కష్టమైన విషయమేమీ కాదు. కప్పం బకాయిల చెల్లింపులకు గోల్కొండ విముఖత చూపడం, గోల్కొండ రాయబారుల ద్వారా మధ్యవర్తిత్వం జరిపి శ్రీరంగ రాయలును కూడా నిలవరించారు. అయితే శ్రీరంగరాయలుకు సహకరించకూడదని గోల్కొండ రాజుపై మొఘల్ చక్రవర్తి ఒత్తిడి తెచ్చాడు. అన్నీ సవ్యంగా పరిష్కారమయ్యే దిశలో చర్చలు జరుగుతుండగా అప్పటి మీర్ జుమ్లా మహమ్మద్ సయీద్ కుట్రపూరిత చర్యల వలన పరిష్కారమార్గాలన్నీ మూసుకుపోయాయి. ఈ పరిణామాలు జరుగుతున్న కాలంలో ఒక ప్రముఖ పాత్ర వహించిన మహమ్మద్ సయీద్ వాస్తవానికి అర్ధిస్తాన్ (Ardistan) నుండి వలస వచ్చిన ఒక విదేశీయుడు. 1630A.D. (1040 A.H.) లో గోల్కొండ అనేక సమస్యలతో ఒత్తిడికి గురవుతున్న సందర్భంలో వచ్చి తన రాజకీయ చతురతతో, ముందు చూపుతో తక్కువ కాలంలోనే అంచెలంచెలుగా 1639లో మీర్ జుమ్లా స్థాయికి ఎదిగాడు'. అనుకున్న పథకం ప్రకారం కర్నాటకపై విజయం సందిగ్ధావస్థలో పడి గోల్కొండ రాజకీయాలకు భయాందోళనలు కలిగించే స్థితిలో ప్రభుత్వం మహమ్మద్ సయీద్కు బాధ్యతలు అప్పగించింది. పూర్తి దక్షిణ ప్రాంతం రాయలు వర్గం, నాయక్ ఆధీనంలో వుండేది. కాని సయీద్కు గట్టి పోటీ ఇవ్వలేక బలహీనపడింది. 1645లో కర్నాటకలోని దాదాపుగా 300 మైళ్ళ పొడవు, 50 మైళ్ళ వెడల్పు విస్తీర్ణంతో వున్న కర్నాటక భూభాగాన్ని మహమ్మద్ సయీద్ తన కైవసం చేసుకున్నాడు. 40 నుండి 45 లక్షలహున్స్ వరకు రెవెన్యూకు అవకాశం దక్కింది. కేవలం కందికోటనే అత్యధిక విస్తీర్ణత కలిగి ప్రత్యేక పాలనా క్షేత్రంగా ప్రతిపత్తి కలిగి వుండేది. ఈ ప్రాంతం వజ్రాలగనులతో వుండి అపారమైన సంపదకు వనరు కాగలిగింది. ఈ విజయంతో మహమ్మద్ సయీద్ కు గొప్ప అదృష్టం వరించిందని చెప్పవచ్చు. ధనరాశితో పాటు, సారవంతమైన భూములను జాగీరులుగా పొందాడు. లక్షలరూపాయల విలువ చేసే లెక్కలేనన్ని వజ్రాలకు అధిపతి అయ్యాడు. బంగాళాఖాతంలో ప్రయాణించే వర్తక ఓడలను స్వంతం చేసుకుని వర్తక సామాగ్రిని దిగుమతి చేసుకుని వర్తక రంగంలో కూడా సంపదను పోగు చేసుకున్నాడు. కేంద్రం లోని సేనకు కమాండర్ గానే గాక అదనంగా తన స్వంత రెజిమెంట్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో ఫ్రెంచి సేనయే గాక, ఫిరంగి దారులను కూడా నియమించుకుని వీరి ఖర్చును తన స్వంత ఖజానా నుండి భరించేవాడు. ఈ రెజిమెంట్లో ఐదువేలఅశ్విక బలం, ఇరవై వేలకాల్బలంతో శక్తివంతంగా వుండి పొరుగు శక్తులను సునాయసంగా ఎదుర్కోగలిగే సామర్థ్యంతో
పుట:గోల్కొండ చరిత్ర.pdf/193
స్వరూపం