Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాయం -13

మొఘల్ దురాక్రమణ

(The Mughal Aggression)

1636 లో జరిగిన చారిత్రాత్మక ఒప్పందం ఆమోదించిన పిమ్మట రెండు దశాబ్దాలకాలం ప్రశాంతంగానే సాగింది. అలాగని ఎలాంటి అసంతృప్తికరమైన సంఘటనలు జరగలేదని చెప్పలేము. గోల్కొండలో నియమించబడిన మొఘల్ హజీబ్ (Hajib), రాజ్యం స్వంత విషయాల్లో జోక్యం కలిగించుకుంటూ చికాకు పరచడం, మొఘల్ చక్రవర్తి పేరుతో బలవంతపు వసూళ్ళకు పాల్పడటం లాంటి అసహ్యకరమైన, అప్రియమైన ఘటనలు జరగసాగాయి. దక్కన్ కార్యకలాపాలు అతని కోరిక ప్రకారం, ఇష్టాయిష్టాలతో సాగుతూ వుండగా మొఘల్ చక్రవర్తి దక్కను ప్రిన్స్ ఔరంగజేబును వైస్రాయిగా పంపించాడు. దానితో ప్రిన్స్ ఆధ్వర్యంలో వున్న దక్కన్ లొని కొన్ని ప్రాంతాలపర్యవేక్షణ కూడా చేయసాగాడు. దక్కన్ కు మొదటి వైస్రాయిగా వచ్చిన ఔరంగజేబు 1636 నుండి 1644 వరకు కొనసాగుతూ దక్కన్ లోని పాలనా వ్యవహారాలను విజయవంతంగా పర్యవేక్షించాడు. కాని ఉత్తరాదిన ఉత్పన్నమైన సమస్యలను చూడటానికి చక్రవర్తి నుండి పిలుపురావడంతో ఔరంగజేబు వెనక్కి వెళ్ళిపోయాడు. కాని దురదృష్టవశాత్తు అతని తర్వాత వచ్చిన అధికారులు తమ సమర్థతను నిరూపించుకోలేక పోయారు. ఖాన్ దౌరాన్ (Khan Douran), జయసింగ్ (Jai Singh), ఇస్లాం ఖాన్ మస్సాది (Islam Khan Mashhadi), షా నవాజ్ ఖాన్ (Shah Nawaz Khan), మురాద్ బక్ష్ (Murad Baksh), షయస్తా ఖాన్ (Shayasta Khan) ఒకరి తర్వాత ఒకరు వచ్చి దక్కన్ పాలనను పర్యవేక్షిస్తూ పక్షపాతంగా వ్యవహరించారు. వారి వ్యవహార శైలి, దక్కన్ రాజ్యం ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీయడంతో ఒప్పందాన్ని ఉల్లంఘించే ధైర్యం చేయక తప్పలేదు దక్కన్ రాజులకు. ఖందర్ (Qandhar) దాడిలో మొఘలులు