Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాద సూచికలు:

1. కందికోట, కడప జిల్లాలో ఎర్రమలై కొండలలో సముద్ర మట్టానికి 1670 అడుగుల ఎత్తులో వుంటుంది. ఫెరిస్తా రికార్డులప్రకారం ఈ కోట 1589 A.D. సంవత్సరంలో నిర్మితమైంది.

2. నేక్ నామ్ ఖాన్, ఇతని అసలు పేరు రజా కులీ. పూర్వం సఫావిదె ప్రభుత్వంలో ఉద్యోగిగా వుండేవాడు. పర్షియా నుండి బహుశా అబ్దుల్లా కుతుబ్ షా పాలనలో దక్కన్ వచ్చాడు. కర్నాటక ప్రావింస్ లొ మహమ్మద్ సయీద్ దగ్గర కింది స్థాయి అధికారిగా నియమింపడినాడు. మహమ్మద్ సయీద్ తిరుగుబాటు చేసిన తరువాత, ప్రావిన్స్లో రజా కులీ చేసిన సేవలకు గుర్తింపుగా మొదట 'రజా ఖాన్' టైటిల్తో, అటు పిమ్మట 'నేక్ నామ్ ఖాన్' బిరుదుతో సన్మానించారు. ఇవే కాక అతని జీవిత కాలంలో, మరణించిన తరువాత కూడా రాజ్యం నుండి అనేక గౌరవాలు పొందాడు. దివాన్ పదవితో అలంకరించ బడినాడు. అతను రాష్ట్ర ముఖ్య వ్యవహారాలను పర్యవేక్షించాడు. జనాదరణతో బాటు దేశం యావత్తు ప్రశంసలందు కున్నాడు. స్వయంగా పండితుడు, కవి, సాహితీవేత్తలను ఆదరించేవాడు. అతడి కవిత్వ రచనలు ఇప్పటికీ ప్రజల నాలుకల మీద పలుకుతుంటాయి. రాజు అబ్దుల్లా మరణించిన ఒక నెలతరువాత 12 మే, 1672 A.D. (1083 A.H.) న రజా కులీ మరణించాడు. రాజలాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిపి, రాజ పరివారానికి చెందిన స్మశాన వాటికలో ఇతని పార్థివ దేహాన్ని ఖననం చేశారు. సమాధి పలక మీద 'పవిత్రాత్మ' (Blessed Soul), 'స్వర్గవాసి' (Occupant of Heaven) అనే వాక్యాలు చెక్కబడ్డాయి. అతని సమాధి నిర్వహణకు, ప్రార్థనలకు ఇతర కార్యక్రమాలఖర్చు నిమిత్తం ఒక గ్రామమే కేటాయించబడినది.