Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుతుబ్ షాహిల ఓటమి తరువాత కూడా ఇంగ్లీష్, డచ్ వారిపై విధించిన నిబంధనలు యథాతద స్థితిలోనే కొనసాగాయి. కాని 1687 A.D. (1098 A.H.) లో గోల్కొండ పతనంతో పరిస్థితులు తారుమారయ్యాయి. దీనితో ఇంగ్లీష్ కంపెనీ వారి అదృష్ట ద్వారాలు పూర్తిగా తెరుచుకున్నాయి. కుతుబ్ల షాహీల నియంత్రణ నుండి కంపెనీకి ముక్తి లభించి కర్నాటక ప్రావిన్స్ మీద పూర్తి అధికారం సాధించారు. అంతేకాదు కాలక్రమంలో ఉపఖండం మీద పెత్తనం సాధించగలిగారు. ఒకవేళ మొఘలుల చేతిలో గోల్కొండ రాజ్యం పతనావస్థకు చేరకపోతే కంపెనీ వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ స్థానబలాన్ని పుంజుకునే అవకాశం దక్కకపోయేది. ఈ సందర్భంలో మరాఠా యోధుడు శివాజి పాత్రను పరిగణనలోకి తీసుకోకపోతే కర్నాటక పైన వివరణ అసంపూర్తిగానే మిగిలిపోతుంది. శివాజి తండ్రి షాజి (shahji), కర్నాటకలోని అనేక ప్రాంతాలపై విజయం సాధించిన విషయం లోక విదితమే. తమ విజయ పరంపరలో ఆదిల్ షాహి సేనను 'గింజి' వరకు తరిమి కొట్టాడు. షాజి జ్యేష్ట కుమారుడు 'ఎకోజి' (Ekoji) తండ్రి తర్వాత దక్షిణ ప్రావిన్స్కు గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాడు. ఎకోజి చాలాచురుకైనవాడు. తంజావూర్, మధుర నాయక్ మధ్య గలపరస్పర ఈర్ష్యాసూయలను అవకాశంగా తీసుకుని తంజావూర్ క్షేత్ర పరిధిలోకి విజయవంతంగా ప్రవేశిస్తాడు. కాని అతని విజయాలు, ఆధిపత్యం సోదరుడైన శివాజి మనసులో ఈర్ష్యను రేపాయి. అదను చూసి చివరికి తండ్రి షాజి సాధించిన కర్నాటకను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అతని రాజకీయ జీవితంలో 1676 A.D. (1037 A.H.) సానుకూలంగా సాగిపోయింది. మొఘలులతోటి శాంతి, సత్సంబంధాలు వుండటంతో దక్షిణ రాజ్యాలపై శివాజీ దృష్టి మళ్ళింది. అదే సమయంలో బీజాపూర్కు మొఘలులతో యుద్ధం జరిగి రక్తపాతాన్ని చూడవలసి వచ్చింది. శివాజీ విజయాలకు కుతుబ్షాహీలమైత్రి, సహకారాలు ఉపయోగపడ్డాయి. అతను 1677 A.D. (1088 A.H.) లో హైద్రాబాద్ సందర్శించి గోల్కొండ రాజుతో రాజకీయ పొత్తు కుదుర్చుకున్నాడు. ఇరు పక్షాలు మొఘలులకు వ్యతిరేకంగా ఒక సంయుక్త కూటమిగా ఏర్పడటానికి అంగీకరించారు. అదేవిధంగా, కలిసి దక్షిణ రాజ్యాలపై జైత్రయాత్ర సాగించడానికి కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా శివాజీ కొత్తగా