పర్యవేక్షించడానికి, కేంద్రంలో వున్న అధికారులతో సంప్రదించడానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. మాదన్న కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ కార్యనిర్వహణకై క్షేత్ర పరిధిని, అధికారాలను మంజూరు చేయడానికి అనుమతించలేదు. అంతేగాక అతను మంత్రిగా పదవి స్వీకరించిన ప్రారంభ దశలోనే వారు ఒక గ్రామాన్ని అద్దెపై తీసుకోవడానికి అర్జీ పెట్టుకోగా నిర్ద్వంద్వంగా తిరస్కరించి తన వ్యవహార శైలిని చాటుకున్నాడు. వారి అర్జీ రాజ్య హితములో లేదనే కారణంతో తిరస్కరించడమైనది. 1096 A.H. (1685 A.D.)లో స్ట్రెన్ షమ్ మాస్టర్ స్థానంలో వచ్చిన ఫోర్డ్ కొత్త కంపెనీ ప్రెసిడెంట్గా వినయంగా, సాదరమైన వాక్యాలతో నాణేలను ముద్రించేందుకు అనుమతి నివ్వవలసిందిగా వినతి పత్రాన్ని సమర్పించాడు. విన్నపాన్ని అతి జాగ్రత్తగా పరిశీలించి, అందరితో చర్చించి, మంతనాలు జరిపి సూక్ష్మమైన విచారణలు జరిపి, చివరికి కేవలం వెండి నాణేలను మాత్రమే ముద్రించాల్సిందిగా అనుమతినిచ్చారు. రాగి నాణేల ముద్రణకు అనుమతి లేదు. ముద్రించబడే నాణేలు కూడా తమ ప్రభుత్వాధీనంలో వున్న నియమాలను అనుసరించి బరువులో గాని, విలువలో గాని భేదం లేకుండ చూడవలసిన జాగ్రత్తలను సూచించారు. స్థానిక అధికారులు కూడా ఆంగ్లేయ వర్తకులతో కఠినంగా వ్యవహరించేవారు. కంపెనీ వ్యవహారాలపై నిరంతర పర్యవేక్షణ వుండేది. పనులు చట్టరీత్యా జరుగుతున్నాయా? లేదా? ఎలాంటి అవకతవకలు లేకుండా చట్టవ్యతిరేకంగా, నియమాలకు విరుద్ధంగా వుండి దేశ ప్రతిష్టపై మచ్చ రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. దేశీయ వర్తకానికి ప్రోత్సాహమిస్తూ స్థానిక వ్యాపారులకుసహాయపడేవారు. యూరోపియన్ (European) వర్తకులకు, దేశ చట్టాలకు బద్దులై వుండాలని ఒత్తిడి చేసేవారు. కంపెనీ అధికార పరిధిలోకి వచ్చే జిల్లాలో ఒకసారి లింగప్ప అధికారిక పర్యటన సందర్భంలో గమనించదగిన, విచిత్రమైన సంఘటన జరిగింది. ఆంగ్లేయ వర్తకులు, లింగప్ప సందర్శించినప్పుడు, స్వాగతం పలకడానికి ఎలాంటి ఉత్సుకత చూపకపోగా, రాజు వారి గౌరవార్థం పంపిన దుస్తులను స్వీకరించుటకు నిరాకరించారు. అంతేగాక స్థానిక వర్తకులతో అభ్యంతరకరమైన వ్యవహార శైలి వుండేది. మద్రాసులో దిగుమతి చేసుకున్న సరుకులపై దిగుమతి
పుట:గోల్కొండ చరిత్ర.pdf/186
స్వరూపం