Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఫ్రెంచి వారి మీద కుతుబ్ షాహి సేన గెలుపు ఒక విశిష్టమైన సంఘటన. ఈ విజయంతో ఆంగ్లేయ వర్తకుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. రాజును సాధ్యమైనన్ని విధాలుగా సంతోషపరచడానికి అనేక విలువైన బహుమతులను, నగదును అందజేయసాగారు. రాజునే గాక, అతని ప్రధాన మంత్రియైన మాదన్నకు, పేష్కార్ (peshkar) అక్కన్నకు కూడా నజరానాలతో ముంచెత్తారు. ఉన్నతాధికారులకు, స్థానీయ అధికారులైన మస్కిమియా (Maski Mian), ఖలీలుల్లా ఖాన్ (Khalilullah Khan) లకు కూడా విలువైన దుస్తులు, ఆయుధాలు, ఇతర సామాగ్రి, వస్తువులతో ఆనంద పరిచారు. ఖలీలుల్లా ఖాన్ కర్నాటక ప్రావిన్సుకు నేమ్ నామ్ తర్వాత బాధ్యతలు తీసుకున్నాడు. బహుమతుల విలువను అంచనా వేస్తే - అబుల్ హసన్ రాజుకు 495 హున్స్, మాదన్నకు 184 హున్స్, నవాబ్ మస్కి మియాకు 52 1/2 హున్స్, ఖలీలుల్లా ఖాన్కు 98 1/2 హున్స్ అందినట్లు సమాచారం. అలాగే ఖలీలుల్లా ఖాన్ కుమారుడు సంజర్ ఖాన్ (సికందర్ titleతో పిలువబడుతున్నాడు) పెళ్ళికి 400 హున్స్ పెళ్ళి కానుకగా బహుకరించారు. పెళ్ళి మద్రాసులో జరిగింది. అలాగే మాదన్న కుమారుడి వివాహానికి 100 హున్స్ను బహుకరించారు. ఈ పెళ్ళి 1678లో జరిగింది. రాజు అబుల్ హాసన్ అధికారిక పనుల మీద మచిలీపట్నం దర్శించినప్పుడు పెద్ద నగదు మొత్తాన్ని రాజుకు నజరానాగా అందించారు. 1676 A.D. (1087 A.H.), 1678 A.D. (1089 A.H.)లో జరిపిన పర్యటనల సందర్భంలో కూడా నగదును రాజు స్వీకరించాడు. ఒక పర్యటనలో (చివరి పర్యటనలో) డచ్ వారి నుండి పదివేలహున్స్, ఆంగ్లేయుల నుండి మూడు వేల హున్స్ను అందుకున్నారు. కంపెనీ ప్రెసిడెంట్ గా స్ట్రెన్ షమ్ మాస్టర్ (Streynsham master) వుండేవాడు. ఇతను 1677 A.D. (1088 A.H.) లో Langhorn స్థానాన్ని భర్తీ చేశాడు.

మాదన్న ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అబుల్ హాసన్ పాలన కంపెనీ వ్యవహారాలకు అంతగా సానుకూలించలేదు. మాదన్న కార్యశీలి. నియమాలను కచ్చితంగా పాటించేవాడు. ఎవ్వరూ ఏ విధంగానూ చట్టవ్యతిరేక పనులకు, నియమాలు, విధానాలకు విరుద్ధంగాను పాల్పడే అవకాశాలు లేకుండా చూసేవాడు. కంపెనీకి, తమ వినతి పత్రాలను, అర్జీలను అందజేసి,