కోరమండల్ తీరప్రాంతం విజయం, ఆంగ్లేయులకంపెనీకి లీజు మంజూరు ఇత్యాది సంఘటన తర్వాత ఒక దశాబ్ద కాలం ప్రశాంతంగా సాగింది. కాని 1656 A.D. (1067 A.H.) లో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొఘలుల ఆశ్రయాన్ని కోరి మహమ్మద్ సయీద్ చేసిన నమ్మక ద్రోహం, పరిస్థితులను పూర్తిగా తారుమారు చేసింది. దీని ఫలితంగా అనేక సమస్యలు ఉత్పన్నం కావడమే కాక కర్నాటక ప్రావిన్స్లో సమస్యాత్మక చొరబాట్లకు దారులేర్పడినాయి. మైసూర్లో శరణు పొందిన శ్రీ రంగరాయలు గందరగోళ పరిస్థితులను అవకాశంగా చేసుకుని పులికాట్, పన్మాలి లమీద దాడికుపక్రమించాడు. ఈ దాడు లకు ప్రతిచర్యగా వెంటనే స్పందించాల్సిన కుతుబ్ షాహి ప్రభుత్వం అటు మొఘలులను ఎదుర్కొనే పరిస్థితి నెలకొనడంతో ఇటు దక్షిణాన తమ దృష్టిని పెట్టలేకపోయింది. 1656 A.D. లో గోల్కొండ కోట ప్రాంతం నుండి మొఘల్ సేన వెనక్కి మళ్ళడంతో పరిస్థితులు సద్దుమణిగి మామూలు స్థితికి వచ్చి శాంతి వాతావరణం ఏర్పడింది. ఆ పిమ్మట అబ్దుల్లా కుతుబ్ షా, కర్నాటక ప్రావిన్సు పగ్గాలను నేఖ్ నామ్ ఖాన్ (Neknam khan) కు అందించాడు . ఇతను మహమ్మద్ సయీద్ నేతృత్వంలో ఇదివరకే కర్నాటక ప్రావిన్స్లో తన బాధ్యతలను నిర్వర్తించాడు. కొత్త గవర్నర్ తన పదవికి సరియైనవాడు. అనతికాలంలోనే చొరబాటు దారులందరిని తరిమివేసి తిరిగి కుతుబ్షాహి ఆధీనంలోకి తీసుకువచ్చాడు. ఈ ప్రాంతాలన్నీ మహమ్మద్ సయీద్ నమ్మకద్రోహం కారణంచే చేజారిపోయినవి. 1659 A.D. (1070 A.H.)లో మద్రాసు వరకు నలభైవేల కాల్బలం సేనతో చొచ్చుకుపోయాడు. మార్చి 1662 A.D. (1072 A.H.)లో డచ్ ఆధిపత్యంలోనున్న 'సంతమ్'ను తిరిగి స్వాధీనపరుచుకున్నాడు. సయీద్ తిరుగుబాటుతో కోల్పోయిన ప్రాంతాలే గాక, కొత్త ప్రాంతాలపై కూడా విజయఢంకా మోగించి తన గణనీయమైన సాహసాలకు నిదర్శనంగా నిలిచి సయీద్ కారణంగా అవమానకరమైన చర్యలతో తీవ్రంగా దెబ్బతిన్న కుతుబ్ షాహీల ప్రతిష్టను పెంచాడు. గుత్తి, కరంకొండ లను గెలిచి కందికోట, సిద్దవటం లతో కలిపేశాడు.
పుట:గోల్కొండ చరిత్ర.pdf/181
స్వరూపం