లేకుండా పోయింది. కానీ ఆదిల్ షాహి బలగాలు (సేన) రంధూలఖాన్ నాయకత్వంలో కర్ణాటకలోని అనేక ప్రాంతాలు: బాంకాపూర్ (Bankapur), హరిహర్ (Hari har), విశ్వపాలెం (Biswapalem), మొదలగు వాటిని ఆక్రమించుకోవడమే కాక బెద్నూర్ (Bednur) వరకు తమ సేనను పంపించగలిగారు. 1644 A.D. (1054 A.H.)లో 'సీర' (seera)ను జయించారు. ఆ క్రమంలోనే 'వెల్లూరు' (vellur), జింగీ (Ginge) ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదిల్ షాహి సేనలో సమానస్థాయి కలిగిన షాజి (Shahji) కూడా రంధూలఖాన్ దారిలోనే నడిచి బెంగళూర్, సెరింగపటం (శ్రీరంగపట్నం) (Serangapatam)లను అతి తక్కువ కాలవ్యవధిలో లొంగదీసుకున్నాడు. గోల్కొండ, ఇబ్రహీం కుతుబ్ షా పాలనలో దాడులు మొదలు పెట్టి అనేక విజయాలను స్వంతం చేసుకుంది. గోల్కొండ ముందుగా తమ నుండి చేజారిన ప్రాంతాలను తిరిగి సాధించుకోవాలనే ఆత్రుత, ఉత్సుకత కలిగి వున్నది. ఈ ప్రాంతాలు రామరాజు ఆధీనంలోకి వెళ్ళాయి. మహమ్మద్ కులీ, ఎల్తమ్ రాజు, వెంకటపతి రాజులదాడులను తిప్పికొట్టి, కొన్ని కర్నాటకకు చెందిన ధనిక జిల్లాలైన నాందేయల్ (Nandeyal), కల్కూర్ (kalkur), మసల్ మురక్ (Masal murak)లపై విజయం సాధించాడు. వెంకటపతికి కంచుకోటలుగా నిలిచిన కందికోట, పెనుగొండ లను కూడా జయించాడు. ఈ విజయ పరంపరలు (జైత్రయాత్ర) తమ ఉద్దేశాన్ని కొంత వరకు నెరవేర్చినా దక్షిణంలో తమ రాజ్య విస్తరణ ఇంకా జరిగి రాజ్యపు సరిహద్దులను విస్తరింపజేయాల్సిన అవసరాన్ని గుర్తించారు.
రాజ్య విస్తరణ ఒక మహత్కార్యంలా సాగుతుండగా 1612 A.D. లో సింహాసనాన్ని అధిష్టించిన సుల్తాన్ మహమ్మద్ పాలనా కాలంలో అంతరాయం ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం సుల్తాన్. యుద్ధం కన్నా శాంతిని కోరుకునేవాడు. కాని సుల్తాన్ వారసుడిగా వచ్చిన అబ్దుల్లా పరిపాలనలో తిరిగి సేన బలాన్ని పుంజుకుని చైతన్యవంతమయింది. నిరాటంకంగా ముందుకు సాగిపోతున్న తన పక్క రాజ్యం ఆదిల్ షాహిల విజయపరంపర, దక్కన్లోని ఇతర సోదర రాజ్యాలకు ఈర్ష్యను కలిగించడమే గాక, ఆదిల్ షాహీలు శక్తి సామర్థ్యాలలో మించిపోవడం