రాజ కుటుంబం కానుకలతో నేను అనుగ్రహింపబడినాను. మా పూర్వీకులు చూపిన సాంప్రదాయ, సంస్కారాలమార్గంలో నాకు నేనుగా అనుసరిస్తూ చక్రవర్తికి కృతజ్ఞతలు అర్పిస్తూ... మా అభిమానాన్ని సమర్పిస్తున్నాను.... మా మాటలను కొంత వివరంగా తెలిపి ఖాజా జహిద్ ఘనమైన కీర్తి గల చక్రవర్తికి నమ్మకాన్ని కలిగించగలరు.వినయంతో కూడిన నా సత్ప్రవర్తనను తెలిపే సమాచారం అందుకున్న పిమ్మట ఘనమైన కీర్తి గలచక్రవర్తి సంతసించి దానికి ప్రతిఫలంగా నన్ను మీకు విశ్వాస పాత్రుడైన సేవకుడిగా గుర్తించి, చక్రవర్తికి ప్రియమైన అభిమానులలో ఒకడిగా చేర్చుకోగలరని... మహమ్మద్ తాహిర్ ద్వారా అందుకున్న సూచనలను పాటించి, అనుసరించగలనని ప్రమాణం చేస్తున్నాను.... 'గజముటి' ఏనుగును చక్రవర్తికి కానుకగా సమర్పించే భాగ్యం కలగడం నా అదృష్టం. దాని గురించి ఘనమైన ఫర్మాన్ ప్రస్తావించడం ఆనంద దాయకం, చక్రవర్తికి గలప్రత్యేకమైన 'గజశాల'లో స్థానం కలిగిస్తారని నమ్ముతున్నాను. ఈ సందర్భంగా ఒక్క కానుకను పంపడం ఉచితం కాదన్న ఆలోచన కలగడంచే చాలా జాగ్రత్తగా శోధించి ఒక విలువైన వజ్రాన్ని సంపాదించాను. అది మీకు కానుకగా పంపిస్తున్నాను... ఇంకా ఎక్కువగా రాయడం మర్యాదను, సంస్కారాన్ని అతిక్రమించినట్లవుతుంది. చక్రవర్తి ఛత్ర ఛాయల్లో విశ్వజనులు సుఖశాంతులతో వర్థిల్లాలని నేను గాఢంగా ఆకాంక్షిస్తున్నాను”.
1636 A.D.లో ముగిసిన ఈ చారిత్రాత్మక ఒప్పందం వాటి పరిణామాల ఫలితంగా గోల్కొండ తన సార్వభౌమత్వాన్ని కోల్పోయిన విషాద గాథలుగా ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా మరణం తర్వాత ఇలాంటి విపత్తు సంభవిస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఈ పరిణామాల ఫలితంగా వైభవంగా నిలిచిన రాజ్యం పరాధీన స్థితికి దిగజారిపోయింది. విచిత్రమేమిటంటే ఆదిల్ షాహి రాజ్యం కూడా పరాజయం పాలైన గోల్కొండ రాజ్యంపై పెట్టిన ఆంక్షలు, ఇలాంటి అవమానకరమైన, దుర్మార్గమైన షరతులు వారికి ఎదురుకాలేదు. ఐనప్పటికీ, బీజాపూర్ రాజ్యం కూడా ఒప్పందాన్ని కుదుర్చుకుని చివరికి సామంత రాజ్యంగా దిగజారిపోయింది. బీజాపూర్ వార్షిక