Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మా దృష్టికి వచ్చిన మరో విషయమేమిటంటే మీ రాజ్యంలో జరిగే శుక్రవారం ప్రార్థనల్లో పర్షియా రాజు పేరుతో స్తుతి ప్రార్థనలు జరుగుతున్నాయి. మీరు, అధికారానికి కేంద్ర బిందువు. మా సార్వభౌమత్వానికి విధేయులైతే, మరెందుకు శక్తినంతా ఆ విదేశీ శక్తులముందు వ్యర్థపరుస్తారు. ఆ పర్షియన్ రాజు పేరును తొలగించి ఆ స్థానంలో ఘనమైన మా చక్రవర్తి పేరును ప్రార్థనల్లో చదవడమే న్యాయసమ్మతము. ఇంకను తెలుపుట ఏమనగా, విశిష్టమైన ఈ 'ఫర్మాన్'తో పాటు చెల్లించాల్సిన కప్పం వివరాలపట్టిక సదరు రెవెన్యూ అధికారి సంతకంతో పాటు జత చేయడమైనది. సూచించిన విధంగా కప్పం పూర్తిగా చెల్లించవలయును. ఫర్మాన్ సూచించిన ఆదేశాలను సక్రమంగా నిర్వహించడానికి ఒక ప్రత్యేక కార్యదర్శిని నియమించడం సరైనదని మేము భావిస్తున్నాము. దాని వలన ప్రతి విషయం ఎప్పటికప్పుడు అంది పరిస్థితులపై అవగాహన కలగడమే గాక, మా సామ్రాజ్యాధీశుడి అనుగ్రహం మీపై, మీ ప్రజలపై వుండి మీ స్వర్గీయ తండ్రిగారైన కుతుబుల్క్ అందించిన నిబద్దతతో వినయపూర్వక సేవలందించినందుకు ప్రతిఫలంగా, గుర్తుగా సదా మీ రాజ్యంపై మా సామ్రాజ్యపు చల్లని చూపు వుంటుంది.

షరతులప్రకారం చక్రవర్తి ఆదేశానుసారంగా మీరు చూపే దృఢమైన విశ్వసనీయత, విధేయతలపై ఎలాంటి సందేహం లేదు. అదే విధంగా మీరు చెల్లించాల్సిన కప్పం విషయంలో కూడా మాకు నమ్మకం వుంది. అన్నీ షరతులప్రకారం సవ్యంగా జరిగినట్లయితే మా అధికారులనుండి మీకెలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకునే బాధ్యత మా శక్తివంతమైన రాజ్యానిది. మొదటి శ్రేణికి చెందిన ఆభరణాలు, వజ్రవైఢూర్యాలతో పొదగబడిన అలంకారిక వస్తువులు, మీ తండ్రిగారు బహుకరించినటువంటి డాక్ సమందర్ (Dak Samander), బషీర్ లాంటి అద్భుతమైన ఏనుగులు, ఇతర బహుమతులు కప్పం రూపంలో పొందవలసి వున్నవి. అందుకు చక్రవర్తి దగ్గర సేవలందించి అపారమైన అనుభవాన్ని గడించిన ముల్లా అబ్దుల్ లతీఫ్, ప్రజలకు ప్రియమైన వాడు, నిజానికి గృహమంత్రిత్వ శాఖకు నియమించబడినా, చక్రవర్తి వ్యక్తిగత సిబ్బంది లో అతి ముఖ్యుడైన ఇతన్ని ప్రభుత్వం పక్షాన పంపడం జరుగుతున్నది. అన్ని