Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పేరును నాణేల మీద ముద్రించడం, శుక్రవారం ప్రార్థనల్లో ప్రస్తుతించడం, విలువైన బహుమతులను అందజేయడం. గోల్కొండ రాజును ఉద్దేశిస్తూ పంపిన సందేశంలోని పూర్తి సారాంశం ఇలా వుంది :

“మొఘల్ చక్రవర్తి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన కుత్బుల్ ముల్క్ వంశస్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది: మా సామ్రాజ్యాధీశుడు ఇస్లాం మతానికి సార్వ భౌముడు, విశ్వాసానికి సృష్టికర్తయైన అల్లాహ్ ప్రభోదించిన క్రియాశీలకమైన మత విశ్వాసాలను ముందుకు నడిపించే సారథి, సున్ని మత సిద్దాంతాలను పరిరక్షించే కర్త, చీకట్లును తొలగించి వెలుగును నింపే మతంపై నమ్మకం గలవాడు. అల్లాహ అందించిన ఆదేశిక సూత్రాలను గౌరవిస్తూ ముందుకు నడిపించడానికి యోగ్యుడు, నాస్తిక భావాలను కలిగి, దైవ దూషణ చేసేవారిని పూర్తిగా సంస్కరించడానికి ఆదేశాలు జారీ చేసినవాడు. మా దృష్టికి వచ్చిన విషయమేమిటంటే, ఘనమైన కుతుబ్ రాజ్యంలో, ఇస్లాం మతాన్ని అనుసరించేవారు బహిరంగంగా అవమానాలకు, అవహేళనలకు గురవుతున్నారని (ఖురాన్ ను విశ్వసించేవారు, మత గురువులు, మత పెద్దలు) నిర్ధారించడమైనది. శాంతిని పాటిస్తూ, ప్రవక్త చూపిన మార్గంలో, ఆయన ఆశీర్వాద మార్గంలో తమ స్వాభావికమైన ఆధ్యాత్మిక నడవడిక, ప్రవర్తనతో వారు మసలుకుంటున్నారు. తమరు అధికారానికి కేంద్రస్థానంగా వుండి దుర్మార్గంగా ప్రవర్తించే వారిని, దుష్టులను శిక్షించకుండా, చూసీ చూడనట్లు వుంటున్నారు. ఈ కారణంచే, ఇలా అసహ్యకరమైన, ఏవగించుకునే పద్ధతిలో, చెడు మార్గంలో నడిచే వారిని మీ రాజ్యంలో అదుపులో పెట్టాలని మార్గదర్శకంగా ఆదేశాలు జారీ చేయడమైనది. ఒకవేళ దురదృష్టవశాత్తు ఎవరైనా ఈ పాపకార్యాలకు పాల్పడితే వారు శిక్షార్హులు. మా ఆదేశాలకు స్పందించకుండా, మీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం పొడచూపితే మా బాధ్యతగా మీ రాజ్యంపై ఆధిపత్యం చేసే హక్కు మాకుంటుందని, మీ ప్రజలు పాలనను మా స్వంతమనే భావనతో నియంత్రించే న్యాయపరమైన హక్కుతో పాటు లేశమంత కూడా అపరాధ భావం లేకుండా అవసరమైతే ప్రజలరక్తం కూడా చిందించగలము.