Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంకా చెప్పాలంటే నేటి తెలంగాణ సామాజిక ముఖచిత్రానికి వైవిధ్యభరితమైన హిందూ-ముస్లిం సంస్కృతుల సమ్మిళిత రూపాలను అందించడంలో కుతుబ్ షాహీల పాలన కాలం ఎంత గానో ప్రభావితం చేసింది. అలాగే ఈ కాలం మధ్య యుగాల నాటి ఫ్యూడల్ సంస్కృతి కి, కాకతీయుల కాలపు జీవనశైలికి, కుతుబ్ షాహీల జీవనతీరులకి వారధిగా నిలిచి, హిందూ ముస్లిం సంస్కృతుల ఆదాన ప్రదానాలకు సంధి కాలంగా నిలిచింది.

అందుకే Knowing history is an another way of opening new vistas, unfolding the mysteries from the folded things and making a quick journey into the past and proceeding to a time travel, to unravel the unknown facts. Actually, what does History give us? Probably nothing. But enable us to revisit the past to find out the life of our ancestors and to learn lessons from their decisions and to build a bright errorless future for the next Generations.

ఈ లక్ష్య సాధనలో ఈ గ్రంథం తెలంగాణ చరిత్ర అభిమానులకూ, చరిత్రకారులకు మాత్రమేకాక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని, భారతదేశ చరిత్ర గురించి వారికి ఇదివరకే తెలిసినదానికి మరింత అదనపు విషయ పరిజ్ఞానాన్ని ఈ గ్రంథం అందిస్తుందని భావిస్తున్నాను.

ఈ గ్రంథ మూల రచయిత అబ్దుల్ మజీద్ సిద్ధిఖి ఈ గ్రంథాన్ని మొదట ఉర్దూలో 1939లో, ఆతర్వాత దీనినే 1956లో ఇంగ్లీష్ లో అనువదించారు. ఆతర్వాత గోల్కొండ చరిత్ర పై ఎన్ని పరిశోధనలు జరిగినా, మరెన్ని గ్రంథాలు వచ్చినా, వాటన్నిటికి ఆధారంగా నిలిచింది ఈ గ్రంథమే కావడం విశేషం.

గోల్కొండ పాలకులు శక్తివంతమైన పరిపాలన, రాజకీయ వ్యవస్థను ఏర్పరిచి రెండు వందల సంవత్సరాలు ఏకధాటిగా పాలించారు. వీరి కాలంలో దక్కన్ పీఠభూమి కళలు, సంస్కృతి, సాంప్రదాయాలతో పరిఢవిల్లింది. ఉర్దూ, తెలుగు సాహిత్యం ఉన్నత శిఖరాలందుకుంది. ఉర్దూ ప్రధాన భాషయైనా, తెలుగు భాషకు సమున్నత స్థానం లభించి తెలుగు సాహితీకారులకు రాజ దర్బారులో పదవులు, గౌరవం దక్కాయి.

సంఘటనలు, తారీఖులే కాకుండా, "గోల్కొండ చరిత్ర" చదవడం అంటే మన సంస్కృతి, మన కళలు, మన సాహిత్యాన్ని మరో విధంగా వీక్షించడమే. అందుకే అబ్దుల్ మజీద్ సిద్దిఖి రచన History of Golconda ను భాషా సాంస్కృతిక శాఖ తెలుగులో ముద్రించడం ఆనందంగా భావిస్తుంది. ఎంతో సాధికారికంగా అనువదించిన డా॥ రూప్కుమార్ డబ్బీకార్ గారికి అభినందనలు!

అక్టోబర్, 2022

ధన్యవాదములతో

డా॥ మామిడి హరికృష్ణ

సంచాలకులు

భాషా సాంస్కృతిక శాఖ

తెలంగాణ ప్రభుత్వం