(Syed Abdullah Khan), మీర్ ఖాసిం, (Meer Qasim) లను నియమించారు. సయ్యద్ అబ్దుల్లా ఖాన్ గోల్కొండ బయట ఆహ్వానించగా, రాజ్యం లోపలమీర్ ఖాసిం స్వాగతం పలికాడు. ప్రయాణం చేసి వచ్చిన ప్రతి దశలో రాయబారికి వైభవంగా విందులు, వినోదాలు అందజేశారు. ఒక దశలో రాజు స్వయంగా వెళ్ళి హౌస్ దురగ్ (Houz Durag) వద్ద ఘన స్వాగతం పలికి విందు సమకూర్చాడు. మీర్జా మహమ్మద్ అమీన్ గార్డెన్లో బస ఏర్పాటు చేసి విలువైన బహుమతులు అందజేశారు. ఏనుగులు, గుర్రాలు, విలువైన వస్త్రాలు, ఇతర బహుమతుల ప్రదానం జరిగింది. రాయబారి, రాజభవనానికి చేరుకున్న వెంటనే గౌరవ సూచకంగా ఒక ఏనుగు, రెండు గుర్రాలు, ఇతర విలువైన బహుమతులను అందజేశారు. అలా తరువాత కూడా గోల్కొండ దర్శించినప్పుడు ఇదే విధంగా స్వాగతం పలికి బహుమతులను అందజేయడం జరిగింది. దానితో పెద్ద మొత్తంలో సంపదను, యాభై వేల నగదును, పది ఏనుగులను, యాభై గుర్రాలను, అనేక దుస్తులను పోగు చేసుకున్నాడు. రాయబారే కాకుండా అతనితో వచ్చిన కింది స్థాయి అధికారులు కూడా నగదును పోగు చేసుకున్నారు. ప్రభుత్వపు బలహీనతలను ఇతర పరిస్థితులను ఆసరాగా తీసుకుని రాయబారి మరింతగా దోపిడీకి తెగించారు. అనాలోచితమైన చర్యలకు పాల్పడి అధిక మొత్తంలో లాభం పొందాలనే దురాశ, అతన్ని సిగ్గు విడిచి అడిగేట్లు చేయడంతో రాజుకు, మంత్రులకు తప్పలేక బలవంతంగా రాయబారి గొంతెమ్మ కోరికలు తీర్చసాగారు. ఈ దశలో కొందరు రాజు అబ్దుల్లాకు డిప్యూటీ పేష్వాగా వున్న షేక్ మహమ్మద్ ఇబ్నె ఖాతున్ ను షా మహమ్మద్ స్థానంలో బదిలీ చేయవలసిందిగా సలహా ఇచ్చారు. షేక్ మహమ్మద్ దౌత్యకార్యాలపై విదేశాలకు వెళ్ళిన వ్యక్తిగా, విదేశీ రాజులతో సంబంధాలు నెరిపిన అపారమైన అనుభవం, సామర్థ్యం కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధుడు. ఈ సందర్భంలో అతను చక్రవర్తి దూతను దర్బారులోకి రాచమర్యాదలను, నియమాలను పాటించవలసిందిగా ఒత్తిడి చేయడమే గాక అతని దుష్ప్రవర్తనను దక్కన్లో నియుక్తుడై వున్న మొఘల్ కమాండర్ ఆసను విన్నవించుకుంటాడు. ఉన్నత వర్గాలతో జాగ్రత్తగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి రాయబారిని తీవ్రంగా మందలిస్తాడు. 1630 A.D.
పుట:గోల్కొండ చరిత్ర.pdf/155
స్వరూపం