ప్రాంతాలపై ఎడతెరిపి లేకుండా దాడులు జరుపుతున్నాడు. 1635 A.D. లో షాజహాన్ తిరిగి వచ్చాడు. ఈసారి దక్కన్ ప్రాంతాల వ్యవహారాలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలనే నెపంతో బుర్హాన్ పూర్ నుండి దౌలతాబాద్ కు రవాణా అయ్యాడు. అక్కడికి చేరుకోగానే అతను తీసుకున్నమొదటి నిర్ణయం, మొఘల్ హజీబ్ (Hajibs) లద్వారా గోల్కొండ, బీజాపూర్ రాజ్యాలకు, నిజాం షాహీలతో మైత్రి సంబంధాలు కొనసాగించరాదని గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. గోల్కొండ, బీజాపూర్ ల మధ్య రహస్య ఒప్పందాలున్నాయన్న విషయం ఒకవైపు, గోల్కొండ, బీజాపూర్ రాజ్యాలు కలిసి నిజాం షాహితో కలిసి రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారన్న సంగతి మరోవైపు చక్రవర్తి దృష్టికి వచ్చాయి. అందుకే మొఘల్ చక్రవర్తి సైన్యం మూడు దళాలుగా విభజింపబడి, సమర్థులైన జనరల్స్, ఖాన్ దౌరన్ (Khan Douran), ఖాన్ జమన్ ఖాన్, షాయిస్తా ఖాన్ (Shaista Khan) లనాయకత్వంలో వుంచాడు. మొదటి దళం గోల్కొండ, బీజాపూర్ సేనను నిలవరించడానికి ఖందర్, నాందేడ్ల వద్ద మకాం వేసింది. రెండవ దళం అహ్మద్ నగర్ను దృష్టిలో పెట్టుకుని అస్తి, కొంకణ్ణపై దాడికి సిద్దంగా వుంది. మూడవ దళం జునైర్, నాసిక్ లవద్ద స్థావరం వేసింది. మొఘల్ సేన ఎన్నో రెట్లు అధికంగా వున్నా, బీజాపూర్ రాజు మహమ్మద్ ఆదిల్ షా, మొఘల్ ఆధిపత్యాన్ని స్వీకరించి, అతని జనరల్ రంథోలఖాన్, మొఘల్ జనరల్తో కలిసి, వ్యూహానికి సహకరిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించసాగాడు ఆదిల్ షా. అయినప్పటికీ రాయబారాలు, వ్యవహరాలు కొన్ని నెలలపాటు సాగదీయబడుతూ చివరికి షాజి తన సేనతో 1635 A.D. (1045 A.H.)లో లొంగిపోవడంతో అన్నింటికి తెర పడింది. అతను లొంగిపోయిన పిమ్మట ఆదిల్ షాహి సేవలో ఉండిపోవడానికి అనుమతించ బడ్డాడు. దానితో చివరికి నిజాం షాహి సల్తనేట్ కథ విషాదాంతంగా ముగిసి మొఘల్ సామ్రాజ్యం దాదాపుగా నలభై సంవత్సరాలుగా తన పెత్తనం సాగించడంతో ఎదురు చూసిన ఆకాంక్ష నెరవేరింది.
నిజాం షాహి రాజ్యం, మొఘలుల దాడులతో పూర్తిగా కుప్పకూలడం దక్కన్ కు ఒక పెద్ద విపత్తు. దీని పరిణామం కేవలం దెబ్బతిన్న రాజ్యానికే కాక వాటి సరిహద్దుల్లో నున్న రాజ్యాలకు, సంపూర్ణ దక్కన్ పీఠభూమి పై ప్రభావం