దిగజారిపోయింది. ఫతే ఖాన్ ను విడుదల చేయడానికి ముర్తుజా ఒప్పుకుని అతన్ని తిరిగి పేష్వా పదవిని అప్పగించడానికి సిద్దమయ్యాడు. మొఘలుల నుండి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి రాజ్య వ్యవస్థను తిరిగి సరియైన మార్గంలో నడిపించి బలోపేతం చేయగలడన్న ధైర్యం, నమ్మకంతో పై చర్యలకు సరేనన్నాడు ముర్తుజా. కాని ఫతేఖాన్, విచిత్రంగా తన విడుదలకు, కనీసం రాజుకు కృతజ్ఞతలు కూడా తెలిపే మంచితనాన్ని ప్రదర్శించలేదు. పైపెచ్చు ప్రతిఫలంగా రాజు పైనే కత్తితో దాడి చేసి, గుండెల్లో దింపే ప్రయత్నం చేయడంతో మానవత్వానికే పెద్ద మచ్చలా నిలడిపోయాడు. హుసేన్ నిజాం షా-III, పది సంవత్సరాల వయసులో వున్న దివంగత రాజు కుమారుడు సింహాసనం ఎక్కాడు. ఫతేఖాన్ పాల్పడిన హేయమైన నిస్సిగ్గు చర్యకు, ద్రోహానికి నిజాం షాహి ప్రజ కోపంతో రెచ్చిపోయి అతనిపై ఎదురు దాడులు చేశారు. ఇక వేరే మార్గం లేక ఫతేఖాన్, షాజహాన్ ముందు లొంగిపోయాడు. ఇదే అదను చేసుకుని, చక్రవర్తి కూడా అతని నుండి నిజాం షాహీలకు చెందిన గజబలాన్ని, అధికమొత్తంలో నగదు, విలువైన నగలు, ఆభరణాలు కోరాడు. ఫతేఖాన్ అతని కోరికను తీర్చకుండా కాలయాపన చేస్తూ తప్పించుకోసాగాడు. ఫలితంగా కొత్త సైనిక దళాన్ని వజీర్ ఖాన్ (Wazeer Khan), ముఖర్రబ్ ఖాన్ (Muqarrab Khan) నాయకత్వంలో దౌలతాబాద్కు రవాణా అయ్యింది. ముఖర్రబ్ ఖాన్, అహ్మద్ నగర్ వదిలి మొఘలుల వద్దకు చేరిన పిమ్మట అక్కడి ఉన్నత వర్గాల్లో ఒకడిగా స్థిరపడిపోయాడు. అంతేగాక 'రుస్తుం ఖాన్' అన్న బిరుదుతో మొఘలులచే సన్మానించబడినాడు. ఈ చర్యతో ఫతేఖాన్ భయపడిపోయి తన కుమారుడు అబ్దుల్ రసూల్ ను సంబంధాలను పునరుద్దరించుకోవడానికి సంజాయిషీగా పంపాడు. మొఘల్ సేన 21 సెప్టెంబర్, 1633 A.D. (1043 A.H.) కోటలోకి ప్రవేశించింది. హుసేన్ నిజాం షా ను బంధించి గ్వాలియర్ కోటలో వుంచారు. ఫతేఖాన్ వార్షిక రుసుముగా ప్రతి సంవత్సరం రెండు లక్షలు మొఘల్ చక్రవర్తికి ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకుని మొఘల్ల అధికార గణంలో చేరిపోయాడు. తమ 'ఖుత్బా' (khutba) స్తుతిగీతంలో చక్రవర్తి పేరును స్తుతించడమే గాక నాణేలమీద 1633 A.D. (1048 A.H.) లో కూడా ముద్రించాడు.
పుట:గోల్కొండ చరిత్ర.pdf/151
స్వరూపం