Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వున్న డబీర్ పదవిని మౌలానా ఒవైస్ కు అంటగట్టాడు. మీర్జా ఖాసీం, హకీం జిబ్రాయిల్, ఇఖ్రాన్ ఖాన్ విదేశీ వర్గానికి చెందిన వీరు వివిధ గౌరవాలు, సన్మానాలు పొందడమే కాకుండా విశిష్టమైన స్థానాలను సంపాదించగలిగారు. సహజంగానే విదేశీయులందరూ వారికి ఏ పాటి చిన్న సహాయం అవసరమైనా షేక్ వైపు చూసేవారు. అతని సహాయాన్ని పొందిన వారై, అంతా షేక్, పేష్వా స్థానాన్ని అలంకరించడం చరిత్రలోనే ఒక ప్రముఖమైన సంఘటనగా ఉల్లేఖించారు. ఈ సంఘటనను మౌలానా అరబ్ : "అలీ కుమారుడైన మహమ్మద్, రాజుగారి ప్రియమైన పేష్వా'గా అభివర్ణించాడు. షేక్ కు అభిమాని ఐన నిజాముద్దీన్ సైది (Nizamuddin saidi) అతని గౌరవ సూచకంగా కవిత్వమే అల్లాడు. చరిత్రకారులు, నిజాముద్దీన్ ఎదుగుదలకు షేక్ ప్రధాన కారకుడు కావడంచే అతను (నిజాముద్దీన్) పేష్వాకు అత్యంత విధేయుడిగా వుండేవాడని, పేష్వా, ప్రముఖుల సమూహంలో కూడా సైదికి విశిష్టస్థానముండేదని అభివర్ణిస్తారు.

1. యూసుఫ్ అందగాడు, జమీదా దివ్యస్వరూపుడు
ఔదార్యంలో హాతీమ్ ను మించినవాడైన రాజు
ఆనందంతో పేష్వా - ఉన్నతపదవితో మహమ్మద్ ను అనుగ్రహించాడు
విలువలు కోల్పోయిన కళలు, పాండిత్యం అతని నిర్వహణలో
తిరిగి తమ పూర్వశోభను సంతరించుకుంటున్నాయి
దిగజారి పోయిన వస్తు ప్రాధాన్యతను కళలు, పాండిత్యం తమ
పూర్వ వైభవాన్ని సంగ్రహించుకుంటూ అభివృద్ధి దిశగా సాగిపోతున్నాయి
నిండు కుండలా జీవితాలు, పొంగిపొరలుతున్న ఆనందాలతో
ప్రజల ముఖాల్లో పేదరికపు ఛాయలు మచ్చుకైనా కానరావు
కాలం నిర్ణయించిన అదృష్టరేఖ, నాలో ఉదయించిన ప్రేరణ - మహమ్మద్
అల్లాహ కృపచే పేష్వా పదవిని గెలిచాడు.
2. కొత్త ఉషస్సులతో సమయం వికసిస్తోంది - ఫలితంగా
జగత్తు యావత్తు ప్రశాంతత, ఉల్లాస డోలికల్లో ఊగుతోంది
రాజుగారి పేష్వాగా - మహమ్మద్; ఇక
ప్రపంచానికి అనంత ప్రమోదాల కాలవీచిక

ప్రభుత్వ అధికారుల అసమర్థత, అలసత్వం, విశ్వాస రహిత ప్రవర్తనయే కాకుండా రాజు బలహీనమైన వ్యక్తిత్వం కూడా రాష్ట్ర వ్యవహారాలను దిగజార్చి, రాజ్య క్షేమాన్ని చిన్నచూపు చూసి పక్కన పెట్టేసింది. అబ్దుల్లా నిర్లక్ష్య వైఖరి,