Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నియమిస్తాడు. దీనికి మరో ఉపాయం పన్ని ప్రతీకారంగా మన్సూర్ తన శాఖాపరంగా స్వయం నిర్ణయాధికారంతో ముల్లా తఖీని డిప్యూటీ మీర్ జుమ్లా గా నియమిస్తాడు. కాని మన్సూర్ ఖాన్ తన కుతంత్రాలు, దుష్ట పన్నాగాలు ఫలవంతం కాకుండానే 1628 A.D. (1038 A.H.) లో మరణిస్తాడు. అతని డిప్యూటి ముల్లా తఖీ, మీర్ జుమ్లా గా అతని స్థానాన్ని ఆక్రమిస్తాడు. స్నేహితుడైన మన్సూర్ పన్నిన కుట్రలతో తను మీర్ జుమ్లా పదవి వరకు వచ్చినా తన నిజాయితీతో అనుకోని దోషాలనుండి విముక్తుడయ్యాడని భావించాడు. ముల్లా తఖీ ప్రభుత్వ లెక్కలు తనిఖీ చేయడమే కాక, అవినీతికి పాల్పడిన వారిని, నిధుల దుర్వినియోగం నేరం కింద నేరస్థులుగా ప్రకటించాడు. అనేకమంది చౌదరీలు నిధుల దుర్వినియోగ నేరం కింద మరణ దండనకు గురయ్యారు. చివరికి నారాయణరావు మజుందారన్ను కూడా పిలిపించి అకౌంట్స్ ను తనిఖీ చేసి పెద్ద మొత్తం లక్షా ఇరవై వేలహున్సన్న అతని నుండి స్వాధీనం చేసుకున్నాడు. సామర్థ్యాన్ని, నిజాయితీని, శ్లాఘనీయమైన సేవలను గుర్తించి 'షరీఫుల్ ముల్క్' బిరుదుతో సన్మానించబడిన వ్యక్తి, ముల్లా తఖీ.

పేష్వాగా షా మహమ్మద్ తన విధులను నిర్వర్తించడంలో అనేకమార్లు తడబడడం, శత్రువులకుతంత్రాలను సమర్థవంతంగా తిప్పికొట్టలేక, ఎదుర్కోలేకపోవడంతో తన అసమర్థతను బయట పెట్టసాగాడు. తన అత్తగారైన ఖానమ్ ఆగా పలుకుబడితో ఈ స్థానానికి ఎదిగిన షా మహమ్మద్, తనపై వుంచిన నమ్మకాన్ని నిలుపుకోలేక, రాజు విశ్వాసాన్ని పొందలేక అన్ని విషయాల్లో విఫలమయ్యాడు. పౌర సంబంధ వ్యవహారాల్లోనే గాక పేష్వాగా అంతరంగిక విషయాల్లో కూడా విఫలమై తన అసమర్థతను అందరూ గుర్తించే విధంగా తన వ్యవహార శైలిని నడిపించసాగాడు. విదేశీ రాయబారి షేక్ మహమ్మద్ (Shaik Mohammod) గోల్కొండకు దౌత్య సంబంధాలపై చర్చ కోసం వచ్చినప్పుడు, దెబ్బతిన్న దౌత్య సంబంధాలను మెరుగు పరిచే విధంగా కార్య భారాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమవ్వడమే గాక ఇతని చర్యల కారణంగా వచ్చిన విదేశీ రాయబారి అసంతుష్టుడై రాజధాని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇతని అసమర్థతను విదేశీ రాజ్యాలు అనేక రెట్లు పెద్దగా చేసి చూపడంతో షా మహమ్మద్ను తొలగించి ఒక విదేశీయుడైన వ్యక్తి షేక్ మహమ్మద్ బిన్ ఖాతున్ (Shaik Mohammod Bin Khatun)కు ఆ బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. షా మహమ్మద్ లోపాలవల్ల రాజధానికి చెడ్డపేరు వచ్చింది. రాష్ట్రానికి ప్రతిగా అతని నిబద్దతను శంకించాల్సిన పరిస్థితిని సృష్టించాడు. బీజాపూర్ రాజైన మహమ్మద్