Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అసమర్థత వలన ప్రభుత్వం నిర్వీర్యమై పరిపాలన కుంటుపడసాగింది. పరిపాలనా వ్యవస్థ పాడైపోవడానికి ప్రధాన కారణంగా మీర్ జుమ్లాగా పదోన్నతి పొందిన మన్సూర్ ఖాన్ను చూపుతారు. మన్సూర్ ఖాన్ ఒక చదువురాని, మొరటుతనం కూడిన నీగ్రో. ఉన్నతమైన, బాధ్యతాయుతమైన పదవులకు ఏ మాత్రం తగని వ్యక్తి. అకౌంట్స్, ఆర్థిక శాఖ విభాగాలను పూర్తిగా హిందూ బ్రాహ్మణులపై నమ్మకంతో వదలివేయడంతో వారు వారి అవసరాలకు ఉపయోగపడే విధంగా, ఇష్టారాజ్యంగా ఆర్థిక శాఖను నిర్వహించడంతో ఈ అనర్థం జరిగింది. దీనికి తోడు భేషజాలకు వెళ్ళి ఉన్నత వర్గ సభ్యులతోనూ, రాజ కుటుంబ సభ్యులతోనూ ఇష్టారాజ్యంగా, అనుచితంగా ప్రవర్తించడంతో ఇతని మీద అందరికి ఒక రకమైన ఏహ్యమైన విరోధ భావం కలిగి అతనికి వ్యతిరేకంగా వుండసాగారు. కాని మన్సూర్ రాజుపై అత్యంత ప్రభావం చూపగల వ్యక్తి. మన్సూర్ ప్రభావం రాజుపై అధికంగా వుండటంతో ఎవ్వరు కూడా తమ బాధలను విన్నవించుకుంటూ అతనికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడానికి ధైర్యం చేయలేదు. చివరికి ప్రధానమంత్రి యైన షా మహమ్మద్ కూడా మన్సూర్ ప్రవర్తన వల్ల అభద్రతా భావానికి గురై భీతిల్లిపోయాడు. పేష్వా అధికారం కూడా ప్రశ్నార్థకమైంది. మన్సూర్ ఉత్తర భారతంలో వున్న సయ్యద్ మహమ్మద్ ఇన్ఫ్రాసి (Syed Mohd. Isfrasi) ని పిలిపించి అతని (షా మహమ్మద్) స్థానాన్ని బర్తీ చేశాడు. మహమ్మద్ ఇన్ఫ్రాసి కుతుబ్షాహీలపాత నమ్మకస్థుడి వద్ద ముందు ఉద్యోగిగా వుండేవాడు. కొన్ని అనివార్య కారణాలచే ఉత్తరానికి వెళ్ళి మొఘలులవద్ద చేరాడు. మన్సూర్ పన్నిన పన్నాగానికి బలైన మరో బాధితుడు ఖాసిం బేగ్. పోలీస్ కమీషనర్. తన వ్యక్తిగత కక్ష సాధింపు కోసం ఖాసిం బేగ్ను బలిపశువును చేశాడు. మచిలీపట్నంలో హవల్దార్ పని చేస్తున్న ముల్లా తఖీ ని ఖాసిం బేగ్ స్థానంలో కూర్చోబెట్టాలని మన్సూర్ తపన. తన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి ఒక పథకం ప్రకారం అతనిపై తప్పుడు ఆరోపణలు సృష్టించి చట్ట వ్యతిరేక పనులు చేసే నీగ్రోలతో సంబంధం అంటగట్టి కమిషనర్పై నిందలు వేస్తాడు. నీగ్రోలు తమ తప్పిదాన్ని, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఒప్పుకున్నా, మన్సూర్ తన ప్రభావంతో అంతా హుష్ కాకి చేసి, ఖాసిం బేగ్ తన పదవికి రాజీనామా చేసే పరిస్థితులకు కారణమవుతాడు. ఈ అవమానాలను భరించలేక ఖాసిం బేగ్ మర్యాదగా తన ఉద్యోగం నుంచి రాజీనామా చేసి, గౌరవంగా పదవీ విరమణ తీసుకుంటాడు. ఇన్ని ఎత్తుగడలు వేసినా మన్సూర్ పథకం పారలేదు. రాజు తాను వ్యక్తిగత ప్రమేయంతో ముల్లా తఖీకు బదులుగా హసన్బేగ్ను పోలీస్ కమిషనర్ గా పదోన్నతిపై