Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్డర్' ను అదుపులో వుంచడానికి తగిన జాగ్రత్తలు తనే స్వయంగా నిర్ణయించి పర్యవేక్షించడం ఆమె వ్యవహార దక్షతకు నిదర్శనం. సమర్థమైన పాలనకు, సమర్థులైన అధికారులు అవసరాన్ని గుర్తించి దానికి తగిన అధికారులను వివిధ హోదాల్లో నియమించింది. స్థానిక చరిత్రకారుడు హయత్ బక్షీ బేగమ్ను ప్రస్తావిస్తూ : "తెలివి, చతురత, గడుసుతనం కలగలిసి తన స్వయం నిర్ణయాధికారాలతో, విచక్షణతో రాష్ట్ర వ్యవహారాలను నడిపిస్తూ ఎవరి ప్రమేయం లేకుండా, జోక్యం కలుగజేసుకోకుండా సాఫీగా నడిపించిన కార్యశీలి మహిళ"గా అభివర్ణించాడు (హయత్ బక్షీ బేగం 1669 A.D. (1081 A.H.)లో మరణించింది).

పరిపాలన సాఫీగా సాగడానికి కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు జరిగాయి. నూతన వ్యవస్థలో రాజకుటుంబానికి చెందిన షా మహమ్మద్ (Shah Mohammad) పేష్వా గా నియమితులయ్యారు. కాని ఎన్నో బాధ్యతలతో కూడిన పేష్వా లాంటి ఉన్నత పదవిని నిర్వహించే శక్తి సామర్థ్యాలు అతనిలో లేకుండా పోవడంతో, రాయబారి కార్య నిర్వహణలో తన యంత్రాంగాన్ని పూర్తి చేసుకుని పర్షియా నుండి తిరిగి వచ్చిన షేక్ మహమ్మద్ ఇబ్నె ఖాతున్ (Shaik Mohammad Ibne Khatun)ను రాష్ట్ర యంత్రాగాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి డిప్యూటి పేష్వాగా నియమించడం జరిగింది. ఈ పదవితో పాటు డబీర్ బాధ్యతలను అదనంగా అప్పజెప్పడమైంది (అప్పటి వరకు మహమ్మద్ రజా నిర్వహిస్తున్నాడు). హవల్దార్ పదవి నుండి ఐనుల్ ముల్క్ మంత్రిత్వ శాఖకు ఎదిగిన మన్సూర్ ఖాన్ హబ్సీని మీర్ జుమ్లా కార్యాలయానికి పదోన్నతి మీద పంపించారు. ఖాసిం బేగ్ పోలీస్ కమీషనర్, హసన్ బేగ్ డిప్యూటీ కమీషనర్ ముందున్న పదవుల్లోనే కొనసాగుతున్నారు. కింది స్థాయి ప్రభుత్వ పదవుల్లోకి వస్తే మీర్ ఖాసిం 'నాజిర్'గా, ఖాజా అహ్మద్ (Khaja Ahmad) తుర్క్ సరయిల్ (Sarkhail గా, నారాయణరావు - మజుందార్ (Mazumdar)గా, సామ్రావు షురూ నవీన్ (Shuruh_nawis)గా, ఇతెమద్ రావును డబీర్ తెలుగులో ఫర్మానాలు రాయడానికి నియమించారు. చిన్నస్థాయి అధికారులు ఎవరైతే రాజప్రాసాదపు పర్యవేక్షణ కార్యాలను నిర్వహిస్తున్నారో వారిని కూడా వేరే వారితో భర్తీ చేయడం జరుగుతుంది.

మన్సూర్ ఖాన్ హబ్సీ (Mansur Khan Habshee):

ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణ జరిగినా దురదృష్టవశాత్తు అధికారులమధ్య పరస్పర ఈర్ష్యాసూయలు, ద్వేషభావాలు, ఫలితంగా ఉత్పన్నమైన అధికారుల