Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపాదకీయం.

రెండు శతాబ్దాల మధ్యయుగ తెలంగాణ చరిత్రకు దర్పణం!


"Sometimes it is felt that history is the study of forts too. For that matter, Indian history revolves around the forts. as the Forts have a symbolic representation to show the safety, security, architecture engineering skills, defensive systems on one hand and the glory, valour richness of those Dynasties on the other. In other words, the study of forts has become synonymous for the study of history too."

ఈ వ్యాఖ్యానం మన దేశ చరిత్రకు ఎంతగానో తగినట్లుగా అనిపిస్తుంది ఆదిమ మానవుడు తన తొలినాటి వాస్తు నిర్మాణం గా Stone Henge ను నిర్మించిన దశ నుండి, కోట నిర్మాణం దాకా జరిగిన ప్రస్థానం గొప్ప నాగరికతా ప్రగతిని తెలియజేస్తుంది. గణ రాజ్యాలు, షోడశ మహా జనపదాలు, మౌర్య వంశం, గుప్త వంశం వంటి సామ్రాజ్యాల నుంచి మొదలుకొని మేవాడ్, చిత్తోడ్, మరాఠా, ఢిల్లీ సుల్తాన్ లు, మొగల్ చక్రవర్తుల దాకా ఆయా రాజ్యాల ఔన్నత్యాన్ని తెలిపే నిర్మాణాలు గా నిలిచినవి కోటలే!

రాజ్యానికి ఉండాల్సిన లక్షణాలు గురించి కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో "సప్తాంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ, అందులో దుర్భేధ్య మైన కోట నిర్మాణం కూడా ఒకటని పేర్కొనడాన్ని బట్టి కోటలకు ప్రాచీన, మధ్యయుగ కాలాలలో ఉన్న ప్రాధాన్యత తేటతెల్లమవుతుంది. ఇదంతా ఒక వైపు అయితే కోట నిర్మాణం, వాస్తురీతి, కొండలను ఆసరాగా చేసుకుని ఇటుక, రాతి, మట్టి, ఇనుము లోహాలతో, సున్నపురాయి, గ్రానైట్లతో నిర్మించే రీతిగా ప్రత్యేక వాస్తు శిల్పానికి (Special Architecture) దారితీసింది. దాని నిర్మాణంలో చూపించిన సాంకేతిక అంశాలు కూడా చరిత్ర అధ్యయనానికి, ఆయా కాలాల నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, రక్షణాత్మక, సాంకేతిక అంశాల (Base for the Observation of Social, Economic, Political, Defensive, Technical Elements) పరిశీలనకు ఆధారంగా నిలుస్తున్నాయి.

ఇక కాకతీయుల విషయానికొస్తే ఎన్నో కోటలను నిర్మించిన పాలకులుగా, ముఖ్యంగా ఓరుగల్లు కోట నిర్మాణ రీతులతో ప్రత్యేకతను సాధించిన చక్రవర్తులుగా వారు ఖ్యాతి గడించారు. 1323లో కాకతీయ చక్రవర్తుల పతనానంతరం దక్కన్ పీఠభూమి ప్రాంతాన్ని పాలించిన ప్రధాన ముస్లిం చక్రవర్తుల కుతుబ్షాహీ కాగా, వారు నిర్మించి రాజధానిగా మలుచుకున్న గోల్కొండ కోట ఆ తర్వాత వందలాది సంవత్సరాల చరిత్రకు సాక్షిగా నిలిచింది.