చేశారు. “రాజు అబ్దుల్లా పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా ప్రపంచమంతా ఆడంబరంగా అలంకరించబడి శోభాయమానమై వర్థిల్లుతోంది" అని రౌనఖి, " అబ్దుల్లా నవయుగానికి ఉదయిస్తున్న నక్షత్రమై, దక్కన్ కు రాజయ్యాడు" అని షిరాజ్ ప్రశంసలతో ముంచెత్తారు.
హయత్ బక్షీ బేగమ్ (Hayat Bakshi Begum)
రాజు ఇంకా మైనారిటీ (బాల్యదశలోనే వుంటే రాజ్య పాలనా వ్యవహారాలను 'కౌన్సిల్ ఆఫ్ రిజెన్సీ' (Council of Regency) అనగా రాజ ప్రతినిధుల సభ పర్యవేక్షణలో సాగుతుంది. ఈ కౌన్సిల్ ఆఫ్ రిజెన్సి పూర్తిగా రాజు తల్లిగారైన హయత్ బక్షీ బేగమ్ నేతృత్వంలో పనిచేయసాగింది. రాజు తాతమ్మ (నాయనమ్మ) ఐన ఖానమ్ ఆగా ప్రాముఖ్యతకు ఎలాంటి భంగం కలగలేదు. రాజ్యం అభివృద్ధి అన్ని రంగాల్లో శిఖరస్థాయికి ఎదిగి, వర్ధిల్లుతున్న దశ. హైదరాబాద్ నగరం విస్తరిస్తూ వాస్తు - శిల్ప కళా వైభవంతో శోభాయమానంగా రూపుదిద్దుకుంటున్న కాలం; ఈ దశలో హయత్ జన్మించింది. సంస్కృతి, సంప్రదాయాలప్రభావం, రాజైన తండ్రికి ఏకైక తనయ కావడంతో తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ, ఇచ్చిన శిక్షణ హయత్ ఉన్నతికి బాగా దోహదపడ్డాయి. అంతేకాదు భర్త పాలనలో కూడా రాజ్య భారాన్ని తన భుజస్కంధాలపై మోసి బాధ్యతలను నెరవేర్చిన సంఘటనలు వున్నాయి. ఖాఫి ఖాన్ (Khafi Khan) వివరణ ప్రకారం అబ్దుల్లా తల్లియైన హయత్ రాజ్య పాలనా వ్యవహారాలను పరిశీలిస్తే అవి తన భర్త అడుగు జాడల్లో నడిచిన ఛాయలు కనిపిస్తాయనడం సత్యదూరం కాదు. 1616 A.D. (1025 A.H.) లో మీర్ మోమిన్ మరణించిన తరువాత పేష్వా పదవిని భర్తీ చేయక రాజు స్వయంగా మహమ్మద్ రజా, ముజాఫర్ అలీల సహాయంతో రాష్ట్ర వ్యవహారాలను, మంత్రి వర్గ కార్యాలను నిర్వహించసాగాడు. మహమ్మద్ రజా డబీర్ (Writer & interpreter) గా నియమించబడ్డాడు. హయత్ నేతృత్వంలో శాంతి సామరస్యాలు, రాజకీయ, రాష్ట్ర మంత్రివర్గ పాలనా వ్యవహారాలు సాఫీగా సాగుతుండడమే ఆమె సామర్థ్యానికి ఒక స్పష్టమైన సాక్ష్యం. అది ఆమె భర్తతో సన్నిహితంగా వుంటూ రాజకీయ జీవితంలో కూడా పాలు పంచుకుంటూ అన్ని రంగాల్లో సహకరించే వ్యక్తిగా వ్యవహరించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడైతే తన కుమారుడు అబ్దుల్లా బాల్య దశలోనే సింహాసన మధిష్టించడంతో పాలనా వ్యవహారాల్లో ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఎలాంటి వివాదాలకు తావివ్వని, తిరుగులేని పాలకురాలిగా తన్ను తాను నిరూపించుకుంది. అబ్దుల్లా పట్టాభిషేక కార్యక్రమం సందర్భంలో ఎలాంటి అల్లర్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా 'లా అండ్