పంపారు. ఇటువంటి గంభీరమైన పరిస్థితి లో మొఘల్ చక్రవర్తికి 1620 A.D. లో తిరిగి షాజహాన్ ను పరిస్థితులను అదుపులో పెట్టడానికి పంపక తప్పలేదు. ఈ దఫా ప్రిన్స్ షాజహాన్కు అనేక చోట్ల యుద్ధం చేయడం తప్పలేదు. దక్కన్ మైదాన ప్రాంతాలైన మండు, బుర్హాన్ పూర్, పేనఘాట్ (Painghat), ఇంకా బాలాఘాట్ లు, తరువాత ఖడ్కీ పటాన్ లను విజయవంతంగా ముగించి మాలిక్ అంబర్ ను అవమానపరిచే నిబంధనలకు ఒప్పించడం జరిగింది. నిజాం షాహి రాజ్యానికి చెందిన రాజధానిని మొఘల్ సైనికులు లూటీలు చేయడం, భవనాలను కూల్చి నేలమట్టం చేయడం, సామాన్య ప్రజలపై అత్యాచారాలు, అవమానపరచడం వంటి చేష్టలతో నానా బీభత్సం సృష్టించారు. ఈ సంఘటన 1621లో జరిగింది. కాని అనుకోని విధంగా అకస్మాత్తుగా ఉత్పన్నమైన పరిస్థితుల దృష్ట్యా అవి షాజహాన్, మొఘల్ చక్రవర్తికి మధ్య ఏర్పడిన అంతర్యుద్ధం వలన పరిస్థితులు తారుమారై ఓటమిని గొప్ప సంస్కారంతో స్వీకరించిన మాలిక్ అంబర్ కు ఒక అవకాశంగా మారి సహాయపడింది. విధి ఆడిన విచిత్రం అని అనవచ్చు, ప్రిన్స్ షాజహాన్ ఆలస్యంగానైనా, దక్కన్ నేలపై విజయుడిగా అవతరించినా, ఒక నిస్సహాయ స్థితిలో స్వయంగా ప్రిన్స్ దక్కన్ పాలకులనే సహాయం అర్థించాల్సిన గత్యంతరం ఏర్పడింది. ఈ అవకాశంతో మాలిక్ అంబర్ కు తన రాజ్యానికి మరికొన్ని సంవత్సరాలు తన నిబద్దత, నిజాయితీని చూపుతూ సేవ చేసే అదృష్టం దక్కింది.
తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన షాజహాన్ చర్యలుకుతుబ్ షాహి రాజ్యాన్ని చికాకు పెట్టే స్థితిలోకి నెట్టివేసింది. ఈ దశలో షాజహాన్ కు ఎలాంటి సహాయాన్ని అందించినా అది నమ్మకద్రోహానికి దారితీయడమే కాకుండా మొఘల్ సామ్రాజ్యపు అధికారాన్నే ధిక్కరించినట్లు అయి పెద్ద సమస్యలను ఆహ్వానించి నట్లవుతుంది. ఈ విషయమై సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా గొప్ప సమన్వయం, రాజకీయ చతురతను ప్రదర్శించాడు. అతి రహస్యంగా శరణార్థిగా వచ్చిన ప్రింస్ ను కొద్దిపాటి ధనం, ధాన్యం, వస్తుసామాగ్రిని అందజేయడంలో సఫలం కాగలిగాడు. అయినప్పటికి బహిరంగంగా మాత్రం తటస్థ విధానాన్ని అనుసరించాడు.
పై సంఘటనలు, (గోల్కొండ) రాజ్యం పాటించిన విదేశీ విధానాలు, వ్యవహారాలకు, కుతుబ్ షాహి ల రాజకీయ చైతన్యానికి, స్పృహకు దృష్టాంతంగా నిలుస్తాయి. అంతేకాదు విదేశీ వ్యవహారాలను, వాటి లోటుపాట్లను వారు అంతగా నిర్లక్ష్య పరచలేదన్న సంగతి కూడా స్పష్టమవుతున్నది. మహమ్మద్ కులీ కుతుబ్ షా,