Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్కారాలందజేశారు. మూడేళ్ళ తరువాత 1604 A.D. (1013 A.H.) లో మహమ్మద్ కులీకి,చక్రవర్తికి మరికొన్ని అద్భుతమైన బహుమతులు అందజేసి సంతోషపరిచే ఒక మంచి అవకాశం చిక్కింది. బహుమతులలో ముప్పై ఏనుగుల అంబారీలు, తెలంగాణ సాంప్రదాయాన్ని వ్యక్తీకరించే అరుదైన వస్తువులు వున్నాయి. గోదావరీ నదికి ఉత్తరాన, దక్షిణాన విసిరేయబడినట్లు చిన్న చిన్న ప్రాంతాలుగా క్షీణించి అల్లాడిపోతున్న రాజ్యానికి ఒక అద్భుతమే జరిగిందని చెప్పవచ్చు. మహా యోధుడు, రాజతంత్రమెరిగినవాడు, సంస్కర్త ఐన ఒక నీగ్రో బానిస అండతో తిరిగి పునరుజ్జీవం పొంది తిరిగి దాదాపుగా పూర్వ స్థితికి చేరుకుందని చెప్పవచ్చు. 1600 A.D.లో మొఘలుల పెత్తనంలోకి జారిపోయిన అహ్మద్ నగర్ కోట, పట్టణం, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి మిగిలిపోయిన సల్తనేట్కు మాలిక్ అంబర్ ఒక వరమై తగిన సమయంలో పిడికెడు నమ్మకస్థులైన అనుయాయులతో తన శక్తినంతా ధారపోసి మనసుపెట్టి, నిజాయితీగా, నిబద్దతతో నిజాం షాహీ రాజ్య పునర్నిర్మాణానికి కారకుడై గట్టి పునాదిని వేయగలిగాడు. ఎప్పుడైతే బహదుర్ నిజాంషాను నిర్భందించి ఆగ్రాకు తీసుకెళ్ళారో, ఆ తరుణంలో మాలిక్ అంబర్, పరెందా (Parenda) ను తాత్కాలిక రాజధానిగా చేసి షా అలీ కుమారుడైన ముర్తుజా-IIను సింహాసనంపై కూర్చోబెట్టాడు.

మాలిక్ అంబర్ ముందు పెద్ద బాధ్యతలే వున్నాయి. అన్ని విధాలుగా నష్టపోయి అల్లాడిపోతున్న రాజ్యాన్ని, అనేక సమస్యలలో కూరుకుపోయిన రాజ్యాన్ని, కూలిపోయిన ప్రభుత్వ యంత్రాంగం, ఎలాంటి రక్షణపరమైన కొలమానాలు లేకపోవడం, వీటన్నింటిని సరిదిద్ది కొత్త శక్తిని అందజేయాల్సిన బాధ్యతను భుజాలపై వేసుకోవాలి. శాంతిభద్రతలు నెలకొల్పాలి. ప్రభుత్వ పాలనను సరిచేయాలి. రెవెన్యూ వ్యవస్థను క్రమబద్దీకరించి, ఆదాయ వనరులను పెంపొందించాలి. అవశేషంగా మిగిలిపోయిన సేన ఎలాంటి మిలట్రీ చర్యలకు సిద్ధంగా లేదు. అందుకు మాలిక్ అంబర్, మహారాష్ట్రలోని స్థానిక రైతులను వేలకొలది నియమించాడు. బర్గీస్లు (Bergees) లేదా మరాఠాలుగా పిలువబడే వీరు డాలు, కత్తి, ఈటెలు ఆయుధాలుగా ధరించి చిన్న అశ్విక దళం గాను కూడా ఏర్పడ్డారు. వివిధ గెరిల్లా యుద్ధశైలిలోని మెళకువలందు వీరికి శిక్షణనిచ్చారు. వేలసంఖ్యలో తయారైన అశ్విక దళం ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా