అలజడులు సృష్టించి, అల్లర్లు, గొడవలకు దారితీసిన మొఘలుల పరిపాలన దక్కన్ ప్రజలకు, మొఘలుల మధ్య మరో యుద్ధానికి కారణమైంది. ఖాన్ ఖనన్, మురాద్ తమ సేనతో గోదావరి తీరం వరకు వచ్చి చారిత్రాత్మకమైన స్థలం, సూప (Supa) వద్ద స్థావరం ఏర్పాటు చేసుకుని చాంద్ బీబీ పంపిన సేనతో తలపడటం జరిగింది. చాంద్ బీబీ పంపిన సేనాదళంలో అటు ఆదిల్ షాహి, ఇటు కుతుబ్ షాహి సేనలు కూడా కలిశాయి. కుతుబ్ షాహి సేనను తాహిర్ ఖాన్ నేతృత్వం వహించగా పూర్తి దక్కన్ ఆర్మీని ఆదిల్ షాహి జనరల్ ఐన సుహేల్ ఖాన్ కమాండ్ చేయగా, అనాదిగా వస్తున్న దక్కన్ సాంప్రదాయం ప్రకారం నిజాం షాహి సేనలు మధ్య భాగంలో నిలవగా, ఆదిల్ షాహి, కుతుబ్ షాహి దళాలు కుడి, ఎడమలస్థానాలను ఆక్రమించి శత్రుసేనను నియంత్రించి మార్గదర్శనం చేయసాగాయి. 27, జనవరి 1597న మొదలై రెండు రోజులు సాగిన యుద్ధంలో దక్కన్ ఆర్మీ పరాజయం పాలైంది. సుహేల్ ఖాన్ తన చివరి శ్వాస వరకు పోరాడి మొఘల్ ఆర్మీకి తీవ్రమైన నష్టం కలగజేయడమే కాకుండా, మొఘలులకు, తన ఇష్టానికి వ్యతిరేకంగా సామంతుడిగా వున్న ఖందేశ్ రాజు రజా అలీ ఖాన్ ను కూడా హతమార్చాడు. సుహేలాఖాన్ మరణంతో పూర్తి పరిస్థితి తారుమారై దక్కన్ ఆర్మీ కలవరం చెంది వెన్ను చూపారు. దక్కన్ పరాజయం పాలు కావడంతో శత్రుసైనికులు వారిని అహ్మద్ నగర్ వరకు వెంబడించి అక్కడి కోటను ఆక్రమించుకోవాలనుకునే సమయంలో మురాద్, ఖాన్ ఖనన్ మధ్య చెలరేగిన అభిప్రాయ భేదాలు మొఘల్ సేనకు ఆటంకం కలిగించి ఎదురైన ఆపదనుండి కొన్ని సంవత్సరాల వరకు నిజాం షాహి రాజ్యం బయటపడింది.
ఇద్దరు జనరల్స్ మధ్య పరస్పరంగా చెలరేగిన రాగద్వేషాల కారణంగా దక్కన్ లొ, మొఘలుల ముందడుగుకు పెద్ద ఆటంకమై ఒక అసహ్యకరమైన చర్యగాహాస్యాస్పదంగా మారింది. చివరికి జనరల్స్ ఇద్దరిని వెనక్కి పిలిపించక తప్పలేదు మొఘల్ చక్రవర్తికి. ఖాన్ ఖనన్ వెంటనే ఆదేశాన్ని గౌరవించగా, ప్రిన్స్ మురాద్ చక్రవర్తి ఆదేశాన్ని దాటవేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించసాగాడు. అందుకు చక్రవర్తి తనకు నమ్మకస్తుడైన వ్యక్తిగత కార్యదర్శి అబుల్ ఫజల్ (Abul Fazal)కు ప్రిన్స్ మురాద్ ను వెనక్కి తీసుకురావలిందని పంపగా, దురదృష్టవశాత్తు అబుల్ ఫజల్