కలిగించింది. నిజానికి దక్కన్ సల్తనేట్ లపై స్వాధీనత కన్నా వాటిని లొంగదీసు కోవడమే మొఘలుల ప్రధానోద్దేశ్యం. ఐతే ఆక్రమణకు ముందు వారితో దక్కన్ రాజదర్బారులతో స్నేహ సంబంధాల పునరుద్ధరణకై అన్వేషించే మార్గాలకోసం ప్రత్యేక బృందాలతో రాయబారాలు నెరపడం లాంటి వాటిని ఇంకా కార్యాచరణలో పెట్టలేదు. ఈ విషయాలపై దక్కన్ రాజుల స్పందన తెలియదు. షేక్ ఫైజి (Shaikh Faizi), ఖాజా అమీరుద్దీన్ (Khaja Ameeruddin), మీర్ మహమ్మద్ అమీర్ బక్షి, మీర్జా మసూద్ (Mirza Masood), ఈ నలుగురు సామ్రాజ్యపు రాయబారులను ఖందేశ్ (Khandesh), అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ రాజ్యాలకు దౌత్య సంబంధ చర్చలకు పంపించాడు. దౌత్యాధికారులతో సౌహార్ద్ర భావమైన సమాచారాన్నందిస్తూ మొఘల్ చక్రవర్తి ఆధిపత్యాన్ని స్వీకరించిన వారి రక్షణ, భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లదని వివరించారు. కవి ఫైజి ని కూడా అహ్మద్ నగర్కు పంపి బుర్హాన్-IIను మొఘలుల ఆధిపత్యాన్ని స్వీకరించడానికి ఒత్తిడి చేయవలసిందిగా ఆదేశాలందాయి. అన్ని రాజ్యాలకంటే ముందుగా చిన్న దేశమైన ఖందేశ్ వర్తమానాన్ని అందుకుని ఆశ్చర్యానికి గురై, ఆలస్యం చేయక చక్రవర్తి ఆదేశానికి తలఒగ్గింది. అంతేకాదు తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఖందేశ్ రాజు, రజా అలీ ఖాన్ తన కూతుర్ని అక్బర్ జ్యేష్ట పుత్రుడు మురాద్ (Murad) కిచ్చి వివాహం జరిపించాడు. కాని ఖందేశ్కు దక్షిణాన వున్న ఇతర దక్కన్ రాజ్యాలు ఏవో సాకులు చూపుతూ మర్యాద పూర్వకంగా అస్పష్టమైన సమాధానాలతో వారి మనోగతాలను దాచిపెడుతూ నిష్క్రియాత్మకంగా వుండిపోసాగారు. ఒక విధంగా పరిశీలిస్తే మొగలుల ఆదేశాలను తిరస్కరిస్తున్న భావాలనే ప్రకటించడం జరిగింది. దక్కన్ సుల్తానులఈ ప్రతిచర్య, మొఘలులకు, దక్కన్ రాజులకు బుద్ది చెప్పి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి కావలసిన బలమైన కారణం దొరికినట్లయింది. దక్కన్ రాజుల నిర్లక్ష్య వైఖరిపై 1593 A.D. లోనే రాయబారులు ద్వారా సమాచారమందినా ఇంకా ఉత్తర భూభాగంలో సమస్యలు సమసిపోక పోవడంతో మొఘల్ సామ్రాజ్యపు సేన 1595 A.D. కు ముందుగా ముందుకు కదలలేక పోయింది. మొదటి దండయాత్రకు ప్రిన్స్ మురాద్, ఖాన్ ఖాన, షారుఖ్ వీర్ణా
పుట:గోల్కొండ చరిత్ర.pdf/124
స్వరూపం