కూడా అతన్ని వదిలివెళ్ళిన వారిలో ఒకడు. అహ్మద్ నగర్ వదిలి వెళ్ళిన తర్వాత మొఘలుల పరిపాలనలో ప్రముఖ స్థానాన్ని సంపాదించి, ఉన్నతాధికారిగా చలామణి అవడమే గాక దక్కన్ రాజ్యాలకు వ్యతిరేకంగా, మొఘలులను దాడికి ప్రేరేపించాడు. 1589 A.D. లో ముర్తుజా మరణం తర్వాత అతని కుమారుడు హుసేన్ నిజాం షా-II రాజయ్యాడు. ఇతను కూడా తండ్రిలాగే రాజ్య భారాన్ని మోయలేని అసమర్థుడిగా రుజువు చేశాడు. ఇతని పాలనలో రాజ్యం దాదాపుగా పూర్తి క్షీణదశ వరకు చేరుకుంది. హుసేన్-II మరణం తరువాత అతనికి వారసులు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా రాజ ప్రముఖులు సమస్య పరిష్కార దిశగా రాజపరివారానికి సంబంధించిన సభ్యులను సింహాసనంపై కూర్చోబెట్టడానికి యోచించి మొఘలుల సేవలో ఆగ్రాలోనున్న బుర్హాన్-II కుమారుడు న్యాయపరంగా హక్కుదారుడు కూడా ఐన ఇస్మాయిల్ ను ఎంపిక చేసి రాజ్యభారాన్ని అప్పగించారు.
ఎదురు చూడని, అకస్మాత్తుగా నిజాం షాహి రాజధానిలో జరిగిన పరిణామాలు బుర్హాన్ ను ఒక సందిగ్ధావస్థలోకి నెట్టివేశాయి. ఆగ్రాలోనే వుండిపోయి మొఘలు సింహాసనానికి సేవకుడిగా కట్టుబడి వుండిపోతే తనకు తన పూర్వీకులనుండి సంక్రమించే రాజ్యాధికారం కోల్పోయే ప్రమాదం వుంది. అలాకాక మరే విధమైన చర్యకు పూనుకుంటే మొఘలు చక్రవర్తి అసంతృప్తికి గురవ్వడం ఖాయం. ఏది ఏమైనా కానిమ్మని చివరికి ఆగ్రా వదిలి దక్కన్కు పయనమయ్యాడు. దక్కన్ కు బయలుదేరే ముందు మొఘల్ చక్రవర్తి అనుమతిని తీసుకోవడంతో పాటు, రాజు అందించబోయే సహాయాన్ని సున్నితంగా తిరస్కరించాడు. వీరి సహాయం కన్నా తన సోదరుడు ఖందేశ్ రాజైన రజా అలీఖాన్ (Raja Ali Khan) సహాయాన్ని అర్థించడం మేలని భావించాడు. అహ్మద్ నగర్ ఘనంగా స్వాగతం పలికి 1589 A. D. లో అతన్ని రాజుగా ప్రకటించు కుంది. రాజు కాగానే అతని ప్రవర్తనలోని మార్పు, మొఘలు చక్రవర్తి పాలనపై చిన్నచూపు బుర్హాన్ పై తీవ్రప్రభావం చూపి మొఘల్ చక్రవర్తి ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది. ఇదే అదనుగా చక్రవర్తి మనసు మార్చుకుని దక్కన్ పై దండెత్తాలన్న నిర్ణయానికి వచ్చాడు. కాని ఉత్తర ప్రాంతాల్లో నెలకొనియున్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా దక్షిణ పథాన తన జైత్రయాత్రను ఇంకా కొన్ని సంవత్సరాలు వేచి చూడాలనే ధోరణిని