ముర్తుజా నిజాంషా కుమారుడు మీరన్ హుసేన్ (Meeran Hussain) కు ఇచ్చి వివాహం జరిపించారు. రాజకీయ నేపథ్యంతో సాగిన వివాహ మహోత్సవ కార్యక్రమాలు 1586 A.D. (955 A.H.)లో సంపన్నమయ్యాయి. అలా రాజకీయ సామరస్యం స్థిరీకరించబడి రెండు రాజ్యాల మధ్య వారి సంస్కృతిని పెంపొందించుకునే సువర్ణావకాశం దక్కింది. నల్ దుర్గ్ లో జరిగిన శాంతి ఒప్పందం, ఆవిధంగా అంతర్ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు పరిమళించడం చరిత్రలో ఒక మైలురాయి. అంతేకాదు, ఈ ఘటన గతంలో మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, జాతి వైరానికి, వర్తమానంలో సుస్థిరపడిన శాంతి, అభివృద్ధిల మధ్య ఒక స్పష్టమైన విభజన రేఖ. నల్ దుర్గ్ శాంతి ఒప్పందం తరువాత రాజ్యం అన్ని రంగాలలో నీతి, న్యాయపరంగా, సామాజిక పరంగా, మేధోపరంగా స్పష్టమైన పురోగతిని చవిచూసింది. అంతిమంగా పదిహేడవ శతాబ్దిలో రాజ్యం అభివృద్ధి పథాన శిఖరాగ్రానికి చేరుకున్నది.
పాద సూచిక:
1. హుసేన్ నిజాంషా గొప్పదనాన్ని తెలపడానికి ఈ పదాలు ఒక స్పష్టమైన 'సాక్ష్యం'గా నిలుస్తాయి. అంతేకాదు సంఖ్యా పరంగా 972 A.H.లో చనిపోయాడని సమయాన్ని సూచిస్తుంది. అతను తాళికోట యుద్ధం ముగిసిన ఐదు నెలలకు దివంగతుడయ్యాడు. యుద్ధం జమాది-II (Jamadi-II) నెలలో జరిగింది. హుసేన్, జిఖాద (ziqada) లో అనగా సంఘటన జరిగిన ఐదు నెలల తరువాత మరణించాడు.