Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుల్తాన్ కులీ కుతుబ్ షా అరుగురు కుమారులలో మూడవ వాడైన జంషీద్ కుట్రపూరితంగా గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించి ఏడు సంవత్సరాలు పాలిస్తాడు. జంషీద్ కుతుబ్ షా మరణం తర్వాత జంషీద్ వితంతువైన రాణి బిల్కిస్ జమన్, తన మిత్ర బృందం సహాయంతో, బాల్యావస్థలో వున్న కుమారుడు సుభాన్ కులీని సింహాసనం వారసుడిగా ప్రకటిస్తుంది. సుభాన్ కులీ ని రాజుగా ప్రకటించటం, అతని పక్షాన రాజ్య వ్యవహారాలు నడిపే వారి పెత్తనాలతో విసుగెత్తి పోయిన ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి, విపక్ష వర్గం నుండి తీవ్రమైన వ్యతిరేకత, ఇత్యాది కారణాలు అంతర్గత సంక్షోభానికి గురి చేసి చివరికి నాల్గవ రాజుగా ఇబ్రహీం కులీని సింహాసనం పై కూర్చోబెట్టడానికి దారులు వేస్తాయి. ఇబ్రహీం కులీ, సుల్తాన్ కులీ కుమారులలో అందరికన్నా చిన్నవాడు. ఇబ్రహీం, తన పాలనా సామర్థ్యంతో గోల్కొండకు అన్ని రంగాలలో ఘనమైన కీర్తిని తెచ్చి 'మల్కిభ రాముడి'గా ప్రసిద్ధికెక్కాడు. ఇబ్రహీం కుతుబ్ షా మరణానంతరం ఇతని మూడవ కుమారుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా కౌమార దశ లోనే, తనకన్నా పెద్దవారైన అన్నలను దాటవేసి రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. మహమ్మద్ కులీని జాతి నిర్మాతగా చెప్పుకోవచ్చు. కుతుబ్ షాహీల పాలనా కాలాన్ని స్వర్ణ యుగం గా చరిత్రలో నిలిపినవాడు. హైదరాబాద్ నగర నిర్మాత. ఇతను తన ముప్పై మూడేళ్ళ పాలన తరువాత కేవలం నలభై ఎనిమిది సంవత్సరాల వయసులోనే మృత్యువాత పడతాడు. మహమ్మద్ కులీ మరణం తరువాత అతని పాలనకు కొనసాగింపుగా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా రాజయ్యాడు. ఇతను మహమ్మద్ కులీ కనిష్ట సోదరుడైన మీర్జా మహమ్మద్ అమీన్ కుమారుడు. మహమ్మద్ కులీ ఏకైక కూతురు, హయత్ బక్షీ బేగంను, సుల్తాన్ మహమ్మద్ వివాహమాడతాడు. సుల్తాన్ మహమ్మద్ తన ముప్ఫై నాల్గవ ఏట మరణించిన తరువాత వీరి జ్యేష్ఠ పుత్రుడు అబ్దుల్లా రాజైనా, తదుపరి నలభై సంవత్సరాల కాలం హయత్ బక్షీ బేగం కనుసన్నల్లోనే రాజ్య పాలన ముందుకు సాగింది. తండ్రి మరణం తరువాత పన్నెండేళ్ల వయసులోనే అబ్దుల్లాకు రాజ్యాభిషేకం జరుగుతుంది. విలాసాలకు అలవాటు పడిన అబ్దుల్లా, జీవితాన్ని ఒక లక్ష్యం, గమ్యం లేకుండా గడిపినాడు. ఇతని అధికార కాలంలో పాలనా వ్యవహారాలన్నీ చాలావరకు రాజమాత హయత్ బక్షీ బేగం పర్యవేక్షణలో సాగేవి. దురదృష్టవశాత్తు, అబ్దుల్లా రాజ్యభారాన్ని స్వీకరించిన రెండవ సంవత్సరంలోనే అకాల మరణానికి గురవుతాడు. అబ్దుల్లాకు మగ సంతానం లేకపోవడంతో సింహాసనానికి వారసుడి లోటు ఏర్పడుతుంది. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. మూడవ కుమార్తె యైన బాదుషా బీబీ వివాహం నాటకీయ పరిస్థితులలో అబుల్ హాసన్తో జరుగుతుంది. చరిత్రలో తానా షా గా ప్రసిద్ధియైన అబుల్ హాసన్ వంశ చరిత్ర పై అనేక సందేహాలున్నాయి. నాటకీయంగా జరిగిన అనేక రాజకీయ పరిణామాలఫలితంగా రాజు అబ్దుల్లా

6

గోల్కొండ చరిత్ర