నూతన జంటకు ప్రధాన లక్ష్యంగా వుండిపోయింది. సాంస్కృతిక ప్రగతికి, భవిష్యత్ తరాల కోసం దేశ సంపదను పెంచడానికి ఈ జంట అందించిన కృషి ఎనలేనిది. సుల్తాన్ మహమ్మద్ తన 34 ఏళ్ళ వయసులోనే మరణించినా, హయత్ బక్షీ బేగమ్ వృద్దాప్యం వరకూ జీవించి తను ఆశించిన ఆదర్శాలను నిజం చేసుకోగలిగింది. సుల్తాన్ మహమ్మద్ మరణం తరువాత వీరి కుమారుడు అబ్దుల్లా రాజైనా, వాస్తవానికి తదుపరి నలభై సంవత్సరాల కాలం హయత్ బక్షీ బేగమ్ కనుసన్నల్లోనే రాజ్యపాలన ముందుకు సాగింది.
పెద తండ్రి మహమ్మద్ కులీ 17 జిఖాదన (Ziqada) 1020 A.H. (1612 A.D.)లో మరణించిన పిదప సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా సింహాసనాన్ని అధిష్టించాడు. న్యాయబద్దమైన హక్కుదారుడు, వారసుడైనప్పటికి యుక్త వయసులో వున్న రాజును అన్ని విధాలుగా సరైన పద్ధతుల్లో సుశిక్షితుణ్ణి చేయడంలో మహమ్మద్ కులీ ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదు. అత్యంత శ్రద్ధ తీసుకుని సుల్తాన్ మహమ్మదు యోగ్యుడైన రాజుగా తీర్చిదిద్దడంలో ఎలాంటి అవకాశాన్ని వదులుకోలేదు. తను ఆరోగ్యం సరిగా వున్న సమయంలో కాని, మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా సుల్తాన్ కే రాజ్యాభిషేకం చేయాలని తన ప్రధానమంత్రి మీర్ మహమ్మద్ మోమిన్ ను ఇతర ఉన్నతాధికారులకు సలహా ఇచ్చేవాడు. తత్ఫలితంగా ప్రధానమంత్రి చొరవ చూపించి యువరాజు పట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లు చేశాడు. సుల్తాన్ కూడ తన తెలివి తేటలతో, ప్రజలపట్ల దేశం పట్ల నిజాయితీగా, ప్రేమపూర్వక వ్యవహారాలతో పాలన సాగిస్తూ అధికారుల మన్ననలు, దేశ ప్రజల ఆదరాభిమానాలు పొందగలిగాడు. పట్టాభిషేకానికి ప్రధాన బాధ్యత వహించిన ప్రధానమంత్రి ఈ శుభ సందర్భంలో రాజును ప్రశంసిస్తూ రెండు భావగీతాలను రచించాడు. ఈ రెండు గీతాలు కూడా చరిత్రలో గుర్తుండిపోయేలా నిలిచిపోయాయి.
భావగీతిక - 1
“నేను నూతన సంకల్పానికై ప్రతిన బూనుతున్నాను
పాత మధువును ఈ కొత్త ప్రేమకు సమర్పిస్తున్నాను
తెలంగాణ నేల, మీ అడుగు జాడల్లో నడిచే కృపకు పాత్రురాలైంది
ప్రతి సేవకుడు మీ చరణాలముందు సదా సాష్టాంగ ముద్రలో వుంటాడు
కొత్త కాంతులతో కీర్తినందుకున్న సఫాహాన్ (Safahan),
చక్రవర్తి అబ్బాస్ షాకు రుణపడి వుంది
హైదరాబాద్ను మీరు నూతన ఇస్ఫాహాన్ (Isfahan) లా మార్చివేశారు.
ఈ సందర్భానికి గుర్తుగా నేనొక యోగ్యమైన కాలపట్టిక (chronogram) ను