Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసుకోవాలన్న తపనతో తన సోదరుడు మహమ్మద్ అమీన్ ను అర్థించడం జరిగిందని చెప్పడానికి చారిత్రక ఆధారా లున్నాయి. "పిల్లవాడిని నాకిచ్చెయి. భగవంతుడి కృప నీ మీద వుంది. పిల్లా పాపలతో నీ ఇల్లు కళకళలాడుతుంది" అని అన్నాడు రాజు కులీ. కానీ ఆశ్చర్యంగా అతని సోదరుడు అమీన్, రాజు కోరికను నిర్లక్ష్యపరిచి అమీన్ మరణించే వరకు రాజు కోరికను దాటవేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే మహమ్మద్ అమీన్ 1596 A.D. (1004 A.H.)లో మరణించాడో సహజ సిద్ధంగానే సుల్తాన్ మీర్జా (సుల్తాన్ మహమ్మద్) పెంపకం, పోషణ, బాధ్యత రాజుకు న్యాయబద్ధమైన సంరక్షకుడిగా సంక్రమించింది. కులీ స్వయంగా తను తన సోదరుడి నివాసానికి వెళ్ళి సుల్తాన్ మహమ్మద్ పెంపకం తన కనుసన్నల్లో జరగాలని చెప్పి, ఆధీనంలోకి తీసుకున్నాడని చరిత్ర చెపుతుంది. తండ్రి మరణానంతరం సుల్తాన్, రాజు పెంపకంలోని రాచరిక భోగాలను ఆనందించాడన్నది చారిత్రక వాస్తవం. రాజకుటుంబ పద్ధతులప్రకారం ప్రత్యేక శ్రద్ద తీసుకోబడి, విద్యాబుద్ధులను నేర్పించడం జరిగింది. ఖాజి సంగాని (Qazi Samghani) ని చదువు నేర్పించడానికి, హజ్రత్ షా యూసుఫ్ (Hazrat Shah Yousaf)ను మిలట్రీ శిక్షణకై నియమించడం జరిగింది. ప్రసిద్దులు, నిష్ణాతులైన వీరిద్దరి గురువుల శిక్షణలో సుల్తాన్ మహమ్మద్ ఒక ఆదర్శవంతమైన రాజుగానే గాక ప్రజ్ఞాశాలిగా, పండితుడిగా, మేధావిగా ఎదగడానికి మార్గాలు సుగమమయ్యాయి. తన పదిహేనవ ఏట 1607 A.D. (1015-1016 A.H.)లో హయత్ బక్షీ బేగమ్ (Hayat Bakhsee Begam) ను వివాహమాడాడు. బక్ష్మీ బేగమ్, మహమ్మద్ కులీ ఏకైక కూతురు కావడంతో, అందులో కాబోయే రాజుగా సుల్తాన్ కావడంతో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా, అద్భుతమైన ఉత్సవంగా దేశవ్యాప్తంగా ఆనందోల్లాసాలతో జరగడంతో ఒక చారిత్రాత్మక సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. వాస్తవానికి వివాహం గోల్కొండలో జరిగినా, దేశం యావత్తు అత్యంత ఉత్సాహంతో ఈ శుభకార్యాన్ని జరుపుకొని ఆనందించారు. నగరమంతా విద్యుద్దీపాల అలంకరణతో మెరిసిపోయింది. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా వచ్చిన అతిథులందరికీ షడ్రసోపేత భోజనం అందించారు. విలువైన వస్త్రాలను రాజ గిడ్డంగులనుండి సరఫరా చేయించి దాదాపుగా ముప్పైవేలకు పైగా వచ్చిన అతిథులందరికి పంచారు. ఈ ఒక్క సంఘటన చాలు, వివాహం ఎంత ఆడంబరంగా జరిగిందో, ఖర్చు ఎంత పెట్టారో తెలపడానికి. గోల్కొండ కీర్తికి, భవిష్యత్ శ్రేయస్సుకు ఈ పెళ్ళి ఒక శుభసూచకంగా పరిగణించబడింది. గోల్కొండ భవిష్యత్ చరిత్ర నిర్మాణంలో కీలక పాత్ర వహించడం