Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్ఫుటభల్లాతకమాధవీకురవకాశోకావళీపాటలీ
కుటజాశ్వత్థకురంటకాదివివిధక్షోణీరుహవ్రాతమున్.

653


చ.

అలఘుచరిత్ర కంటె హృదయంబులఁ గూరినరాగపూరముల్
వెలి కుఱుకం బతత్రములు విప్పుచుఁ గప్పుచు జోడు గూడి యీ
పులినములందుఁ బెక్కెడలఁ బుష్పశరోద్ధతిఁ గేళి సల్పెడున్
గళరవమాధురీమహిమ గ్రాలఁగఁ జక్రమరాళదంపతుల్.

654


ఉ.

ఒక్కెడ మందమారుతరయోత్థితనూతనపుండరీక యై
యొక్కెడ శీతలోదకకణోక్షితకోకనదప్రకాండ యై
యొక్కెడ గంధలుబ్ధమధుపోదరనీలపయోజషండ యై
యొక్కెడ హృద్యసంపదల నొప్పుచు నున్నది కంటె నిమ్నగన్.

655


క.

పారిప్లవశతశోభిత, యై రమణీయాండజారవానాదిత యై
సూరిజననిషేవిత యై, యారూఢిం బొల్చుచున్న దాపగ కంటే.

656


క.

చందనతరుబృందంబు ల, మందమనోహరసుగంధిమహనీయము లై
కందళితవిద్రుమము లై, యందంద చెలంగుచున్న వంతటఁ గంటే.

657


తే.

అనఘ యీదేశ మతిరమ్య మగుచుఁ బొల్చెఁ, బర్వతోద్భూతసకలసంపదలచేత
వర్షరాత్రంబు చనుదాఁక హర్ష మెసఁగ, నిచట వసియింత మఖిలార్థహితము పొంటె.

658


వ.

మఱియు సుగ్రీవపాలితం బైనకిష్కింధాపురం బిచ్చటికి సమీపం బై యుండు
మృదంగాడంబరంబుతో ఁ గూడి గీతవాదిత్రనిర్ధోషంబును వానరులకోలాహల
శబ్దంబును వినఁబడుచున్న దని పలికి వెండియు రాముం డి ట్లనియె.

659


క.

హరిరాజ్యంబును భార్యను, నిరుపమగతి నధిగమించి నిత్యశ్రీవి
స్ఫురణ నిననందనుం డ, త్యురుతరసుఖగోష్ఠి నలరుచుండుం గాదే.

660


వ.

అని పలికి యారఘుకుంజరుండు బహుదృశ్యదరీకుంజపుంజరంజితం బై నయన్న
గంబునం బొల్చుగుహయందు నధివసించె నప్పుడు.

661


క.

నిరుపమధాతుసముజ్జ్వల, సురుచిరమణికటకసానుశోభిత మయ్యు
న్గిరి సీతావిరహితుఁ డగు, నరవిభునకు సమ్మదం బొనర్పక యుండెన్.

662

రాముఁడు సీతం దలంచుకొని దుఃఖించుట

వ.

ఇత్తెఱంగున నారఘుసత్తమందు లక్ష్మణసహితంబుగా గిరిగుహ నాశ్రయించి.

663


ఉ.

అచ్చటిపద్మకుట్మలము లచ్చటిమత్తమధువ్రతవ్రజం
బచ్చటినూతనోత్పలము లచ్చటిదాడిమీబీజసంచయం
బచ్చుగ జానకీకుచకచాక్షిరదద్యుతిఁ దెల్ప నాత్మలో
హెచ్చిన శోకతాపమున నెంతయుఁ తత్పరతన్ కృశించుచున్.

664


చ.

చిలుకలు మ్రోయఁ గోయిలలు చెంగటఁ గూయఁగఁ బిన్నతెమ్మెర