యు డ ము. 867 తే. తాజములు నిత్యఫలపుష్పశాలు లయ్యె
- బరఁగఁ బర్జన్యుఁడును గాలవర్షి యయ్యెఁ
బవనుఁడు మనోజ్ఞముగ సుఖస్పరుఁ డయ్యె
ర మించి రఘురాముఁ డవనిఁ బాలించునపుడు. చ. పనివడి నాల్గువర్ణములవారు నిజోచితకర్మయు క్తు లై యనవరతంబు ధర్మరతు లై శుచు లై కడు సత్యవాదు లై యనుపమలక్ష ణాభియుతు లై సుగుణాన్వితు లై చెలంగి రా ఘనమతి రాఘవుండు కుతుకంబున రాజ్యము నేలు చుండఁగన్. తే. భూరిగుణయుక్తు లై నతమ్ములను గూడి యఖిలజనములు తనుఁ గొనియాడుచుండ నుదిత తేజుండు రాముందు పదునొకండు వేలవర్షంబు లిల యేలె వేడ్కతోడ. a చూచిరా - శ్రీమద్రామాయణ పరన శ్రవణ పూజనాది ఫలశ్రుతి. తరా ళా.ఆయుష్యం బతిధన్యము మనయశస్యంబు న్నృపశ్రేణికి నేయగప్రాప్తినిమిత్త మార్షము సభాసేవ్యాది కావ్యం బుపా దేయంబు న్మునిరాట్కృతంబు సుజన ధ్యేయంబు భద్రప్రదం బీయాఖ్యానము దీని విన్ననునుజుం డింపొందు వీతాఘుఁ డై. తే. చెలువు మీఱంగ రామాభిషేచనంబు విన్న వి త్తకామునకును వి త్త మొదవుఁ త్ర కామున కొదవు సుపుత్రుఁ డరుల గెలిచి రాజ్యంబుఁ బ్రాపించు శ్రీతివిభుండు. 3849 3350 8851 8352 8853 వ. మఱియు నీరామచరిత్రంబు విన్న యువతులు రామలక్ష్మణ భరతశత్రుఘ్నుల చేతఁ గౌసల్యయు సుమిత్రయుఁ గైకయు నెట్లు జీవత్పుత్తులై రట్లు నిజపుత్రుల చేత జీవ త్పుత్ర లై ప్రకాశింతు రదియునుంగాక, 3854 తే. జగతి నీరామవిజయంబు శ్రద్ధధానుఁ, డై జితక్రోధుఁ డై విన్న యమలచరితుఁ డఖలదుర్గంబులఁ దరించి యంచితముగఁ, బెద్ద కాలంబు జీవించి పెంపు వడయు. తే. మఱియు రామాయణము విన్న మానవుండు కాంక్షి తవరంబు లొందు రాఘవునివలనఁ బరఁగఁ బర దేశమున నున్న బంధుజనులు సేమమున వత్తు రాత్మీయభామములకు, 3856 వ, మఱియు నీరామాయణ శ్రవణ మాత్రంబున దేవతలును బితృ దేవతలును సంతు ష్టు లగుదు రెవ్వని గృహంబున నిమ్మహాకావ్యం బుండు నట్టిగృహంబున విఘ్నం బు లన్నియు శమించు రజస్వలాంగనలు విన్న గుణవంతు లైనపుత్రులం బడ