Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దినకరవినిస్సృతరశ్మియుం బోలెఁ జూడ్కికి వ్రేఁ గగుచుండె నప్పుడు శరపాదప
శిలాజనితంబు లైనతచ్ఛరీరవ్రణంబుల నుండి శోణితధారలు ధరాధరంబున
నుండి తామ్రగైరికసంపృక్తజలధారలుం బోలె సాంద్రంబుగా స్రవించుచునుం
డె వెండియు నద్దేవి రామాస్త్రసమాహతుండై రణరేణుపరికీర్ణుండై రుధిరోక్షిత
సర్వాంగుం డై నేలఁ గూలి యున్నభర్త నవలోకించి లోచనప్రభవంబు లగు
శోకబాష్పంబుల నతనిం బ్రమార్జించుచు నుచ్చైస్స్వనంబున రోదనంబు
సేయుచుఁ బింగాక్షుం డగునంగదకుమారు నుద్దేశించి.

589


సీ.

తనయ నీజనకుని దారుణపశ్చిమావస్థను జూడుము వైర మెల్లఁ
గడచన జముని నికాయంబునకుఁ బోవుచున్నవాఁ డీనవార్కోదయాంగుఁ
డూనినభక్తిఁ దన్మాననీయాంఘ్రియుగ్మంబున కభివాదనం బొనర్పు
మనవుడు భక్తితో నతివేగమున లేచి పీనవృత్తము లగుపృథుభుజముల


తే.

నంగదుఁడ నే నని నిజాహ్వయంబు నొడివి, యతనిచరణాబ్జములు సమున్నతిఁ బరిగ్ర
హించి విడువనిశోకంబు హృదయసీమ, దట్టమై పర్వ మిగుల సంతాప మొందె.

590


వ.

ఇట్లు దుఃఖించుచున్నకుమారుం జూచి తార వెండియు భర్త నుద్దేశించి.

591


చ.

అనుపమభంగి నీకు వినయంబున ము న్నభివందనంబుఁ జే
సిన సుతు గారవించి చిరజీవి సుభభన పుత్త్ర యంచు మిం
చినయనురక్తి తేటపడఁ జేయుచు దీవన లిత్తు వేటికో
యనఘచరిత్ర పల్క విపు డక్కట తొల్లిటిప్రేమ దప్పెనే.

592


తే.

అధిప యేను బుత్త్రసహాయనై వినిహత, చేతనుఁడ వైనని న్నుపాసింతు నిపుడు
ఘోరకంఠీరనాలీఢగోవృషమును, గూర్చి వత్ససహిత యైనగోవుకరణి.

593


తే.

హామనోనాథ నీవు సంగ్రామయజ్ఞ, మద్భుతంబుగఁ జేసి రామాస్త్రసలిల
మందు సతి నగువనుఁ బాసి యసభృథంబు, నందు నెట్లు సుస్నాతుండవైతి విపుడు.

594


తే.

కపికులోత్తమ తొల్లి సంగ్రామమందు, మెచ్చి పరితుష్టుఁడై యనిమిషవిభుండు
కరుణతో నీ కొసంగినకనకమాల, యేల గనుపట్ట దఱుత నేఁ డెందుఁ బోయె.

595


తే.

శైలరాజంబులకుఁ బ్రదక్షిణము సేయు, భానురుచి యమ్మహాత్మునిఁ బాయనిక్రియ
వానరేంద్ర గతాసుండ వైననిన్ను, రమ్యముగఁ బాయ కున్న దీరాజ్యలక్ష్మి.

596


వ.

మహాత్మా పథ్యం బగుమదీయవాక్యం బంగీకరింపక త్రోచి పుచ్చి వచ్చితి వేను
భవదీయమతనివారణంబునం దసమర్థనై యప్పు డుపేక్షించినందువలన నిట్టియ
వస్థ దొరకొనియె నీయట్ల యేనును బుత్రసహితంబుగా నిహత నైతి రణహతుం
డ వైననీతోఁగూడ రాజలక్ష్మి నన్నుఁ బాసి చనియె నని పెక్కుతెఱంగుల విల
పించుచు శోకార్ణవపరిఫ్లుతయై కన్నీరు మున్నీరుగా రోదనంబు సేయుచున్న తార
నవలోకించి తరస్వి యగుసుగ్రీవుండు భ్రాతృవధజనితశోకాక్రాంతుఁడై మొగం
బున దైన్యంబు దోఁపఁ గన్నుల బాష్పజలంబు గ్రమ్ముదేర మనం బుదిలకొన