| తే. |
కమున నవిహితమయ్యె లోకంబునందుఁ, బరఁగ నాదైవకృతయుగపదవిధాన
మరయ నన్యవిధంబుగా దెఱిఁగియున్న, ఘనుల కిలఁ గోపతాపము ల్గలుగ వెపుడు.
| 561
|
| వ. |
అది యంతయు గతజలసేతుబంధంబు తలంచినం బ్రయోజనంబు లే దింకఁ
గార్యంబు తెఱంగు వినుము.
| 562
|
| సీ. |
భానుజ కన్నులు గానరా వయ్యెఁ బ్రాణము కంఠగత మయ్యె నమరపురికిఁ
దడయ కేగెదను జెప్పెడి దేమి నీ కిఁక మహనీయకీశసామ్రాజ్యపదవి
సిరుల నంతఃపురస్త్రీలను గైకొమ్ము బాష్పపూర్ణాస్యుఁ డై పరఁగ వ్రాలి
దీనుఁ డై శోకించువానిఁ బ్రియుం డగువానిఁ బ్రాణసమానుఁ డైనవానిఁ
|
|
| తే. |
దనయు నంగదుఁ జూడు మీతనికి నభయ
మొసఁగి దుఃఖంబునకుఁ జొరకుండ దాత
వై పరిత్రాత వగుచు నాయట్ల నీవు
కడఁగి నిత్యంబుఁ గావుము కరుణ మెఱసి.
| 563
|
| వ. |
మఱియు నీతారేయుండు నీతోడఁ దుల్యపరాక్రముండును శ్రీమంతుండు నను
రూపకర్ముండును దరుణుండును మహాబలుండును కావున నీకు బాసటయై నీవు
చూడ రణంబున నవక్రపరాక్రమంబున నాక్రమించి క్రవ్యాదలోకంబు నెల్ల
నశ్రమంబున నిర్జింపఁగలం డదియునుం గాక.
| 564
|
| తే. |
తపనజ సుషేణపుత్రి యీతార సాధ్వి, యర్థసూక్ష్మవినిశ్చయమందుఁ జాల
నేర్పు గలది కార్యాకార్యనిర్ణయజ్ఞ, తగవు ధర్మంబు నడపెడుతన్వి సుమ్మి.
| 565
|
| క. |
ఈనెలఁతభావ మొక్కిం, తైనను విఫలత్వ మొంద దటు గావున నో
భానుసుత యెద్ది పనిచిన, దానిం గాదనక సేయఁదగు నీ కెపుడున్.
| 566
|
| వ. |
మఱియు నొక్కహితంబుఁ జెప్పెద వినుము.
| 567
|
| క. |
అవిశంకచేత నీరా, ఘవకార్యము నీ కవశ్యకర్తవ్య మగు
న్దవిలి యొనర్పక యుండిన, రవిసుత ననుఁ బోలె నిను శరంబున ద్రుంచున్.
| 568
|
| క. |
ప్రాకటముగ నిననందన, కైకొను మీదివ్యహేమకంజాతసహ
ప్రాకీర్ణమాల యిది య, స్తోకబలారోగ్యవిజయశుభముల నొసఁగున్.
| 569
|
| వ. |
అని భ్రాతృసౌహృదంబునం బలికిన వాలిపలుకు లాకర్ణించి హర్షంబుఁ బరిత్య
జించి క్రమ్మఱ దీనుండై గ్రహగ్రస్తుం డైనచంద్రునిమాడ్కి నిష్ప్రభత్వంబు
నొంది కొండొకసేపునకుఁ దదీయమృదుమధురాలాపంబులం దేఱి యతనిచేత
ననుజ్ఞాతుం డై యక్కాంచనమాలఁ బ్రతిగ్రహించె నిట్లు సుగ్రీవునకు హేమ
మాల యొసంగి పురందరపుత్త్రుండు నిజపుత్త్రు నవలోకించి పుత్రస్నేహంబున
వాత్సల్యంబు నెఱపి యనునయాలాపంబుల ని ట్లనియె.
| 570
|
వాలి యంగదునకు హితముఁ గఱపుట
| తే. |
దేశశాలంబు లెఱిఁగి సుధీవరేణ్య
సుఖము దుఃఖంబు సమముగాఁ జూచికొనుచుఁ
|
|