యు డము. 805 శ్యంబువలన సంస్కరించుటకుం దగియున్న వాఁడు జై రంబు మరణాంతంబులు మత్సంకల్పిత ప్రయోజనం బంతయు నిర్వృత్తం బయ్యె నీరావణుండు ప్రీతివిష యంబునందు నీ కెట్టివాఁడు నాకు నట్టివాఁ డయ్యె నితనికి విధిపూర్వకంబుగా సంస్కారంబు గావించి నీవు యశోలాభంబు వడయు ముని పలికిన నారాఘవుని వచనంబువిని యవ్విభీషణుండు రావణునకు యాయజూ కానురూపసంస్కారంబు గావింప సమకట్టి సుగంధి ద్రవ్యవిశేషయు క్తంబుగాఁ జందన కాష్ఠంబులచేతఁ బద్మకోశీరంబులచేఁ జితిగావించి వేదోక్త శ్రీ యావిశేషంబున రాంకనా స్తరణో పేతం బైనయచ్ఛితామధ్యంబున రావణునిక ళేబరంబిడియె నప్పుడు ఋత్విజులు వేదవిహిత క్రమంబున నంత్యేష్టి గావించి పితృమేధంబుఁ జేసి యా గ్నేయభా గంబున వేదియందు యథాస్థానంబునఁ బావకుం బ్రతిష్ఠించి శాస్త్ర దృష్టనిధి చేతఁ దన్మధ్యంబునఁ బళువిశసనంబు గావించి తదంగంబులు మృతంబునం నడి మీ హోమంబుగావించి దధిసహితమృతపూర్ణం బైనస్రువంబగ్నిలోనం ఒకవై చి శకటంబును ముసలంబు నులూఖలంబును దారుపాత్రంబులు నరణీయు ను దారణీయు శ్రుతిస్మృతిప్రో క్తవిధానంబున సర్వంబును యథాస్థానంబున నునిచి రాజగవి నాలంభించి తచ్చర్మంబు చేత నాచ్చాదించి రావణునిక ళేబరంబుగంధ మాల్యవస్త్రంబుల చేత నలంకరించి లాజలు చల్లి రంత విభీషణుండు విధియు క్తంబుగా రావణున కగ్నిసంస్కారంబు గావించి స్నానంబుఁ జేసి యార్ద్రవస్త్ర ధరుండై విధిపూర్వకంబుగా నతనికిఁదిలో దకంబులోనంగి నమస్కరించి మండో దరీ ప్రముఖనిఖిలాంతఃపుర కాంతల సాధు వాక్యంబుల ననునయించి లంకకుం బనిచి కృతకృత్యుం డై గ్రమ్మఱ రామునొద్దకుం జనుదెంచి వినీతుండై గొలిచి యుండె రాముండును రిపువధజనితహర్షవదనుం డై సుగ్రీవవిభీష ణహనుమదాది సుహృత్సమేతుం డై వృత్తాంతకుఁ డైనపురందరునికరణిఁ దేజరిల్లుచుండె నంత రావణవధంబు వీలోకించి దేవగంధర్వదానవులు రావణునివధంబును రాముని పరాక్రమంబును వానరులయుద్ధంబును సుగ్రీవునిమంత్రిత్వంబును లక్ష్మణుని యనురాగంబును వీర్యంబును నానా ప్రకారంబులు వక్కాణించుచు మఱియు శుభకథా ప్రసంగంబులు సేయుచుఁ బరమానందభరితాంతఃకరణులై తమతను విమానంబులతోఁ గూడ నిజనివాసంబులకుంజని రప్పుడు రాముండు నూతలిం బూజించి యీ దివ్యరథంబు గొని నీవు దివంబునకుం జను మని పలికిన నతండు రాముని చేత ననుజ్ఞ వడసి శిఖప్రభం బైనయమ్మహనీయస్యందనంబుతోఁగూడ నింద్రుపాలికిం జనియె నంత రాముండు పరమప్రీతుం డై సుగ్రీవుం గౌఁగిలిం చుకొని హరిశ్రేష్ఠులచేతఁ బూజ్యమానం డై లక్ష్మణసహితంబుగా నిజబలంబు లోనికిం జనుదెంచి తనపార్శ్వంబునఁ బరమానంద ప్రవర్ధమాన తేజుండై యలరు చున్న లక్ష్మణు నవలోకించి యి ట్లనియె. ర
- 2882