Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సంగతి దక్కి విప్రియ మొనర్చెనె బాలుఁడు భక్తిశీలుఁడున్.

542


ఉ.

అక్కట నీకు వానరకులాధిప విప్రియ మించు కేనియున్
నెక్కొని చేసి యే నెఱుఁగ నీమృదుకంజసమాంఘ్రిమూలముల్
దిక్కని యున్నదాన నను ధీరత నొంటిగ డించి పోవఁగా
నెక్కుడె వేగ తోడుకొని యేగుము వెంబడిఁ గూడ వచ్చెదన్.

543


వ.

అని యనేకప్రకారంబుల భర్తసమీపంబున వానరస్త్రీసమన్వితంబుగా దుఃఖిం
చుచు నతనితోడిదె లోకం బని తలంచి ప్రాయోపవేశంబు సేయ సమకట్టి
యంబరంబు నుండి జాఱిన తార పగిది నేలంబడి యున్నతార నవలోకించి
మందమందవాక్యంబుల నాశ్వాసించుచు హనుమంతుం డి ట్లనియె.

544

హనుమంతుఁడు తార నాశ్వాసించుట

క.

విను గుణదోషకృతం బగు, తనకర్మఫలంబు దేహి తప్పక పొందున్
జననీ యీలోకంబున, ననిశము శుభ మైన నశుభ మైనం బెలుచన్.

545


ఉ.

పూనికి దేహికిం బుడమిఁ బుట్టినయప్పుడె చావు నిక్కమౌ
మానిని వారిబుద్బుదసమం బగుఁ గాయము నందుఁ జూడ నె
వ్వానికి నేమి శోక మగువర్ణితతత్త్వవివేకు లైనసు
జ్ఞానకు లొడ్లజన్మమరణంబులకుం దలఁకొంద రెంతయున్.

546


ఉ.

ఈకపిచక్రవర్తి మనుజేశ్వరదివ్యపృషత్కవిద్ధత
న్వీఁక నఘౌఘముల్ దొలఁగి నిర్మలుఁడై సురరాజపుర్యసం
ఖ్యాకమనీయభూరివిభవాప్తి వహించె సరోజనేత్ర నీ
వాకులపాటు దప్పి హృదయంబున ధైర్యముఁ గూర్పు మిత్తఱిన్.

547


చ.

అడలెడునిన్నుఁ జూచి హృదయంబున శోకము విస్తరిల్లఁగా
నడలుచు నున్నవాఁడు సుగుణాకరుఁ డంచితవిక్రముండు నీ
కొడు కితఁ డంగదుం డితనిఁ గుందకయుండ ననూనయింపు మి
వ్వడువున నేడ్చినన్ మరల వత్తురె చచ్చినవార లుర్వరన్.

548


తే.

మానినీమణి జంతుసంతానమునకుఁ
గాల మొకరీతి వచ్చునే కర్మయుక్త
సరణి యొకవేళ సౌఖ్యంబు సంఘటించుఁ
గడఁగి యొకవేళ దుఃఖంబు గలుగఁజేయు.

549


తే.

భూతకోటికి నిజకర్మజాతఫలము
అనుభవింపక రిత్తవో దట్లు గాన
ధరణిఁ బండితుఁ డగువాఁడు తత్క్రమం బె
ఱింగి శుభకర్మములె యాచరింపవలయు.

550