7760 గోపీనాథ రామాయణము బులును గేశంబులును గలో కప్రకారంబున హోమంబు సేయుచుండె నప్పుడు తదీయహో నుధూమంబు విలయ కాలసంకర్ష ణముఖ వినిర్గత నిశ్శ్వాసధూనంబు పగిది సతిభయంకరం బై వెలుపలికి నిర్ణమించి ప్రళయకాల జీమూతంబుకరణి గగనంబును దిక్కులును నీరంధ్రంబుగా నావరించిగాఢసంతమసంబుఁబుట్టించె నప్పుడుసిద్ధచారణమరుద్గంధర్వయక్ష, కిన్నరోరగాదులత్యంత సాధ్వసంబున సంధీ భూతులై సుడివడిరి వాతంబులు కలుషంబు లై సుడిసె దిక్పాలకు లేమియుం దోఁపక ఆచ్చవడియుండిరి వానరులు భయకంపితాంగు లైతూలగతిందూలిరి జగంబంతయు నతిభయంకరం జై తోఁచె నమ్మహోత్పాతంబులన్నియునిలో కించి రావణకృత్యం బంతయు నెఱింగి నీతివిద్యావిభూషణుం డగువిభీషణుండు రయంబున రామునియొద్దకుం జనుదెంచి యి ట్లనియె. 2544 రావణుండు పాతాళహోనంబు చేయుచున్నాఁ డని విభీషణుండు శ్రీరామున కెఱింగించుట. 2545 25 16 చ, నరవర మిము మార్కొని రణం బొనరింపఁగ లేక భీతుఁ డై కర మకుదార రావణుఁడు కావ్యునిపంపున భూబిలంబులో నురపడి నాభిచారికపుహోమముఁ జేయుచు నున్న వాఁడు స త్వరముగ వేలిమిం జెఱుప వానర వీరులఁ బంపు మి త్తఱిన్. చ. పరువడి హోమకృత్య మది పొరము ముట్టిన వహ్నియందు దీ వ్యరథకృపాణ బాణకవచాదికము ల్వెస నుద్భవించు భీ కరగతి వాని నన్నిటిని గైకొని పోరికి నేగుదెంచిన హరీపరమేష్ఠి శంకరులకై న నసాధ్యుఁడు వాఁ ఉధీశ్వరా. ఉ. నా విని రాఘవుండు కపినాథున కిట్లను బాహు విక్రమ శ్రీవిభవాభి రాములను వృక్షచరా గ్ర్యుల సంగదాదుల స్వావిరి వేలిమిం జెఱుపఁ బంపుము జా గోనరింప వల్వ దా రావణు నాజిలో గెలువ రా దటు హోమము పార మొందినన్. సీ. అని యానతిచ్చిన నవ్వానరాధీశుఁ డంగదజాంబవదాంజ నేయ నలనీలకుముదపన సవలీముఖధూ మ్ర గంధమాదనగ జగనయవృష భ శరభ గోముఖరంభ శతవలిమైందద్వివిదగవాక్షను షేణ వినతతార ముఖ్య వానరయూధపులఁ బడికోటుల నియమించి పంచిన రయము మెఱయ . వారు బ్రహ్మండభాండంబు పగుల నార్చి, వృష్టిమనముల గతి వినువీది నిండి పక్షవత్పర్వతంబుల పగిది నేగి, లావు దీపింప నురవడి లంకఁ జేరి. అథిరం అంగ దులు రావణునిపోతాళహోమంబునకు భంగము సేయ నరుగుట, పూవులో శా. ప్రాకారంబులు గూల్చి వేయములు విధ్వంసంబు నొందించి య అస్తోక ప్రౌఢిమ ద్వారరక్షకుల రవీరులం జంపి నా 2547 2548
పుట:గోపీనాథరామాయణము2.pdf/783
స్వరూపం