డము, మాల్యవంతుని సేనాసమేతంబుగా నంతకగోచరుం జేసి జయంబు గొని కర తమవాషధీపర్వతుడై సింహనాదంబు చేసి శ్రీ ప్యాదిత్యునిభంగి నింగి వెలుం గుచు మనో వేగంబున లంకాద్వీపంబు కాయం జనియె నప్పుడన్మహనీయమూ క్తి తేజోవిశేషంబును దోష ణ మహీధరమణిదీప్తులు దూరంబు నవలోకించి రాముండు సూర్యుం డుదయించి వచ్చుచున్న వాఁ డని తలంచి లక్ష్మణ ప్రాణశంకి, తుం డై PL . 2487 తుకు సంధిపై రాముండు చూరంబున హనుమంతునిం జూచి సూర్యుం డని మోట కోషించుట, అధి సీ. అక్కట లక్ష్మణుం డమరారిశక్తిచే మేదినిఁ బడియే సమీరసుతుఁడు దివ్యౌషధీలతల్ దెచ్చెద ననిపోయి తడవాయె భానుఁ డున గ్రభంగి నుదయించుచున్న వాఁ డదయుఁడై యింకనే నేమి సేయుదుఁ నమ్మఁడెట్లు బ్రత నెలమి సుమిత్రతో నేమని భాషింతు భరతునిదు ఖ మేపగిది నణఁతు తే. ఘనుఁడు శత్రుఘ్నుఁ డడుగ నేమని నచింటు నల విభీషణుతోడ నే నన్నమాట యనృత మయ్యె మదన్వయయశము వోయె వనచరులకష్టమంతయు వ్యర్థ మయ్యె. మ. అని యిబ్బంగిఁ దలంకుచుండఁ గపివంశాధీశుఁ నేతెంచి రా మన రేంద్రుం గని పల్కె నోయనఘ ధీమంతుండ వీ వివ్విధం బున దుఃఖింపఁగఁ జెల్లునయ్య జగముల్ పుట్టి౦ప రక్షింప గ్ర ర్దన నాశం బొనరింప దఝుఁడ వెద ధైర్యంబు గీల్కొల్పుమా. 2498 2499 తే, దేవ నాలవజాము నర్తించు చున్న, డెలమి నిఁకనొక్క యామంబుగలదు రాత్రి లక్ష్మణున న కేమిహాని గల్గదు దురంత, దుఃఖ మది వీడి "స్థచిత్తుండ నగుచు. తే. అనుచు నిబ్బంగి సూర్యనందనుఁడు ధైర్య మెంత చెప్పిన నుడుగ కయ్యినకులుండు పెక్కువిధముల దుఃఖించి పిదపఁ గోప రసము నిగుడంగ నత్యంత రౌద్రుఁ డగుచు. 2501 సి. వనజ మిత్రుండు మద్వంశంబునకుఁ గర్త యయ్యును గృపమాలి యనుజుఁడిచట మూర్ఛదేఱక మున్నె మునుకొని పగతుర పాలివాఁ డై నన్ను పరిభవించి యుదయించి చనుదెంచుచున్నవాఁ డితనిదౌ దుర్జయ మేమని దూఱ వచ్చు. గడు వేగమున వీనిఁ బుడమిపైఁ బడఁ గూల్చి జగమంతయు నరాక్షనం బొనర్తుఁ తే, జూడుఁ డని ర క్తకాంతులు చూడ్కి గములఁ గ్రమ్మకొన విల్లుగొని జగత్రయము బెగడ ఘోరరౌద్రాస్త్ర మరిఁబోసి దారుణముగ గుణరవముఁ జేసె దైత్యులగుండె లవీయ.. 175 2502
పుట:గోపీనాథరామాయణము2.pdf/776
స్వరూపం